హెల్త్ టిప్స్

రక్తనాళాల్లో చేరిన వ్యర్థాలను బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలో అన్ని అవయవాల్లోకెల్లా గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అందువల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేస్తుండాలి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే కొందరికి రక్త నాళాల్లో ప్లేక్‌ (plaquе) పేరుకుపోతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. రక్తనాళాలు వాపులకు గురవుతాయి. ఫలితంగా హార్ట్‌ ఎటాక్‌లు వస్తాయి. కనుక రక్త నాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్య ఉన్నవారు కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటుంటే రక్త నాళాల్లో ఉండే ప్లేక్‌ కరిగిపోతుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. మరి రక్త నాళాల ఆరోగ్యం కోసం రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..

here it is how you can unclog arteries by eating these foods

1. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గ్రీన్‌ టీని తాగాలి. గ్రీన్‌ టీలో కాటెకిన్స్, ఫినాల్స్ అనబడే సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చూస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు.

2. ఆలివ్‌ ఆయిల్‌ గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అధ్యయనాల ప్రకారం రోజూ ఆలివ్‌ ఆయిల్‌ను వాడే వారికి హార్ట్‌ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 41 శాతం వరకు తగ్గుతాయి. అందువల్ల రోజూ ఆలివ్‌ ఆయిల్‌ను వాడడం మంచిది.

3. పాలకూరలో ఫైబర్‌, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

4. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాలు వాపులకు గురికాకుండా ఉంటాయి. రోజూ పసుపుతో తయారు చేసిన డికాషన్‌ను తాగాలి. లేదా రాత్రిపూట గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగాలి. దీంతో గుండెను సంరక్షించుకోవచ్చు.

5. రోజుకో యాపిల్‌ పండును తింటున్నా రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts