Hibiscus Tea : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అందమైన పుష్పాలు పూస్తాయి. ఆ పువ్వులను చూస్తేనే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అలాంటి పువ్వుల్లో మందార పువ్వులు కూడా ఒకటి. ఇవి ఎన్నో రకాల రంగుల్లో పూస్తాయి. కానీ ఎరుపు రంగు మందారాలకు కూడా క్రేజే వేరు. అయితే ఈ పువ్వులు కేవలం అలంకరణను మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. షాకింగ్ ఉన్నా ఇప్పుడు మేం చెప్పబోతున్నది నిజమే. దీన్ని ఆరోగ్య నిపుణులే స్వయంగా వెల్లడిస్తున్నారు. మందార పువ్వులతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఇక వాటితో మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మందార పువ్వులతో డికాషన్ తయారు చేసి అందులో తేనె, నిమ్మరసం కలిపి రోజూ ఒక కప్పు తాగాలి. దీంతో మనం అనేక లాభాలను పొందవచ్చు. మందార పువ్వులతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
మందార పువ్వుల టీని తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో రక్తనాళాలు క్లీన్ అయి హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ పువ్వుల టీని తాగితే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇలా మందార పువ్వుల టీతో అనేక లాభాలు కలుగుతాయి. కనుక ఈ టీని రోజూ సేవించాలి.