High BP : ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీతో బాధపడుతున్నారు. బీపీ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది. బీపీ ఉన్నట్లయితే కచ్చితంగా రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. బీపీ తగ్గిందా, పెరిగిందా..? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉందా.. వంటివి తెలుసుకోవాలి. ఒకసారి హైబీపీ వచ్చిందంటే కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్ లని ఉపయోగించాలి.. అని డాక్టర్లు చెబుతూ ఉంటారు.
అయితే బీపీతో బాధపడే వాళ్ళు టాబ్లెట్స్ కి బదులుగా ఈ పప్పు తింటే బీపీ నార్మల్ లోకి వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇక ఆ విషయాల గురించి చూసేద్దాం. కొన్ని రకాల మందులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని రకాల బీపీ మందులని ఉపయోగించడం వలన లివర్ కూడా ప్రమాదంలో పడుతుంది. ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి, టెన్షన్ మొదలైన కారణాల వలన బీపీ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. బీపీ కంట్రోల్ లో ఉండడానికి ఈ పప్పు బాగా సహాయపడుతుంది.
పుచ్చకాయ విత్తనాలు బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ విత్తనాలని ఆరబెట్టి పౌడర్ కింద చేసుకుని తీసుకుంటే బీపీ నార్మల్ లోకి వస్తుంది. ఈ పౌడర్ కి సమానంగా గసగసాలని కూడా పొడి చేసుకోవాలి. వేడి నీళ్లతో ఈ పొడిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అర స్పూన్ చొప్పున వేసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
ఈ పొడిలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీపీతో బాధపడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బీపీతో బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా బార్లీ నీళ్లు, ఆకుకూరలు, అరటిపండు తీసుకుంటే కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. కాకరకాయని తీసుకోండి. అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన కూడా మీరు మీ బీపీని డేంజర్ జోన్ లో పడకుండా చూసుకోవచ్చు.