హెల్త్ టిప్స్

Garlic With Honey : తేనెలో వెల్లుల్లిని రాత్రిపూట నాన‌బెట్టి.. మ‌రుస‌టి రోజు ఉద‌యం తినండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Garlic With Honey : వెల్లుల్లి ఆరోగ్యనికి చాలా మేలు చేస్తుంది. వంటల్లో వెల్లుల్లి వాడుకుంటే, అద్భుతమైన ప్రయోజనాలని పొందడానికి అవుతుంది. వెల్లుల్లితో రకరకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈమధ్య కాలంలో చాలా మంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి, చాలామంది ఇంటి చిట్కాలు ని పాటిస్తున్నారు.

నిజానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించి, ఈజీగా మనం అనారోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు. తేనె, వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండిటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే, రెట్టింపు లాభాలని పొందడానికి అవుతుంది. తేనె, వెల్లుల్లి రెండు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. నిజానికి ఈ రెండిటిని కలిపి తీసుకుంటే ఊహించని ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తేనే మిశ్రమాన్ని ఎలా తీసుకోవాలి..?, ఏ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు అనే ముఖ్య విషయాలను చూసేద్దాం.

honey soaked garlic many wonderful health benefits

తేనె, వెల్లుల్లిని ఉదయం పూట పరగడుపున తీసుకుంటే మంచిది. గ్యాస్ సమస్య ఉంటే పరగడుపున తీసుకోవద్దు. గ్యాస్ సమస్యతో బాధపడే వాళ్ళు, అల్పాహారం తీసుకున్నాక తీసుకోవడం మంచిది. వెల్లుల్లి, తేనే రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. దీంతో మన శరీరం ఎలాంటి వ్యాధినైనా కూడా తట్టుకోగలుగుతుంది. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి.

వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే రక్త సరఫరాని మెరుగుపరుచుకోవచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఇవి చూస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ రెండిటిని తీసుకుంటే డయేరియా, అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి బాధలు ఉండవు. పెద్ద పేగుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ కి కూడా అడ్డుకట్ట వెయ్యొచ్చు. జలుబు, ఫ్లూ, జ్వరం, సైనస్ వంటి సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. వెల్లుల్లి కి తొక్కలు తీసేసి, వెల్లుల్లి రెబ్బలని తేనెలో నానబెట్టుకుంటూ ఉండాలి. రెండు వారాలపాటు మధ్య మధ్యలో కలుపుతూ వెల్లుల్లిని తేనెలో నానబెట్టండి. రెండు వారాల తర్వాత మీరు దీనిని వాడుకోవచ్చు.

Admin

Recent Posts