హెల్త్ టిప్స్

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఉల‌వ‌లు.. ఇంకా ఎన్నో లాభాలు..!

ప్ర‌పంచంలో అత్యంత ప్రాచీన్య ధాన్యం జాబితాలో ఉల‌వ‌లు మొద‌టి స్థానంలో నిలుస్తాయి. ఉల‌వ‌ల‌ను ఉత్త‌ర భార‌త దేశంలో అధిక శాతం మంది తింటుంటారు. ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు, ఐర‌న్‌, కార్బొహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. హైబీపీని త‌గ్గించి బీపీ నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తాయి. ఉల‌వ‌లు న‌వ ధాన్యాల్లో ఒక‌టిగా ఉన్నాయి. వీటిల్లో తెలుపు, ఎరుపు, న‌లుపు రంగు ఉల‌వ‌లు ల‌భిస్తాయి. మ‌నం ఎక్కువ‌గా ఎరుపు రంగు ఉల‌వ‌ల‌ను తింటుంటాం.

ఉల‌వ‌ల‌తో చారు చేసి తిన‌వ‌చ్చు. క‌షాయం చేసి తాగ‌వ‌చ్చు. దీంతో మూల వ్యాధి త‌గ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. శ‌రీరంలోని క‌ఫం తొల‌గిపోతుంది. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌రిగ్గా వ‌స్తుంది. ఉల‌వ‌ల‌ను తింటే శ‌రీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అజీర్తి త‌గ్గుతుంది. ఆక‌లి స‌రిగ్గా అవుతుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది.

horse gram can increase sexual stamina in men

ఉల‌వ‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్ల‌ల‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది ర‌క్తం త‌యార‌య్యేలా చేస్తుంది. ఉల‌వ‌ల‌ను తింటుంటే మూత్రాశ‌యంలోని రాళ్లు క‌రిగిపోతాయి. త‌ర‌చూ ఎక్కిళ్లు వ‌స్తుంటే ఉల‌వ‌ల‌ను తినాలి. అధికంగా బ‌రువు ఉన్న‌వారు, పొట్ట ఉన్న‌వారు ఉలవ‌ల‌ను తింటుంటే ఫ‌లితం ఉంటుంది. శ‌రీరం మంట‌గా ఉంటే ఉల‌వ‌ల పొడిని మ‌జ్జిగ‌లో క‌లిపి తాగుతుండాలి. ఉల‌వ‌ల‌ను తింటే బోద‌కాలు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. లైంగిక శ‌క్తి పెరుగుతుంది. ఉల‌వ‌ల‌ను వేడి చేసి కాపడంలా పెడితే వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి. మూత్రంలో మంట త‌గ్గాలంటే ఉల‌వ‌ల నీళ్ల‌ను కొబ్బ‌రి నీటితో క‌లిపి తాగాలి. ఉల‌వ‌లు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. కాబ‌ట్టి వీటిని తిన‌డం మ‌రిచిపోకండి.

Admin

Recent Posts