Fat : పొట్ట దగ్గ‌రి కొవ్వును క‌రిగించే డ్రింక్ ఇది.. వేగంగా ఫ‌లితం వ‌స్తుంది..!

Fat : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, అధిక పొట్ట‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అధిక బ‌రువు, అధిక పొట్ట స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, పంచ‌దార‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, రోజంతా కూర్చొని ప‌ని చేయ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అలాగే మ‌న శ‌రీరంలో మెట‌బాలిజం రేటు త‌క్కువ‌గా ఉన్నా కూడా అధిక బ‌రువు స‌మ‌స్య త‌లెత్తుతుంది. మెట‌బాలిజం రేటు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. శ‌రీరం బ‌రువు పెరుగుతుంది.

మెట‌బాలిజం రేటు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి బ‌రువు పెరుగుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు శ‌రీరంలో మెట‌బాలిజం రేటును పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోమెట‌బాలిజం రేటు పెరిగి మ‌నం క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతాము. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మొల‌కెత్తిన విత్త‌నాల‌ను, ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను, స‌లాడ్ ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరుగుతుంది. దీంతో మ‌న శ‌రీర బ‌రువుతో పాటు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తొల‌గిపోతుంది.

how reduce fat with this drink
Fat

అధిక పొట్ట స‌మ‌స్య నుండి మ‌నం చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో మెట‌బాలిజం రేటును పెంచి శ‌రీర బ‌రువును తగ్గించే ఆ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిమ్మ‌కాయ‌లో ఉండే ర‌సాన్ని తీసి నిమ్మ తొక్క‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక‌టిన్న‌ర గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో క‌ట్ చేసుకున్న నిమ్మ‌కాయ తొక్క‌లు, పావు టీ స్పూన్ ప‌సుపు, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి నీటిని బాగా వేడి చేయాలి. ఈ నీటిని స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించిన త‌రువాత వ‌డ‌క‌ట్టి ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి.

ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరుగుతుంది. క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు, మ‌లినాలు, విష ప‌దార్థాల‌న్నీ తొల‌గిపోతాయి. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో నీర‌సం తగ్గుతుంది. రోజంతా ఉత్సాంగా ప‌ని చేసుకోవ‌చ్చు. దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా 20 రోజుల పాటు తీసుకుంటూనే చ‌క్క‌టి జీవ‌న విధానాన్ని, చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను పాటించాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు, అధిక పొట్ట స‌మ‌స్య నుండి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Share
D

Recent Posts