Lungs : ప్రస్తుత తరుణంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనకు అనేక రకాల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. దీంతోపాటు పొగ తాగడం, ఇన్‌ఫెక్షన్లు వంటివి కూడా మనకు ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అయితే కారణాలు ఏమున్నప్పటికీ చాలా మందికి లంగ్స్ పాడై తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. దీంతో అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఇక అందుకు ఏయే ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్ర పడి ఆరోగ్యంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలతోపాటు నట్స్, విత్తనాల్లనూ ఎక్కువగా లభిస్తాయి. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఈ పండ్లను తినాలి..
ఇక ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే అందుకు విటమిన్ సి ఉండే పండ్లు కూడా ఎంతో పనిచేస్తాయి. ముఖ్యంగా నారింజ, స్ట్రాబెర్రీలు, క్యాప్సికంలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి.
అలాగే చిలగడ దుంపలను తరచూ తింటున్నా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తినడం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.