Walking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా ఏదో ఒక శారీరక శ్రమ చేయాల్సిందే. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీరక శ్రమ చేయడం లేదు. గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కావడం వల్ల చాలా మందికి అసలు రోజూ శారీరక శ్రమ ఉండడం లేదు. దీంతో అధికంగా బరువు పెరిగి పలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికంగా బరువు పెరగడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మనం రోజూ శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది.
ఇక శారీరక శ్రమ విషయానికి వస్తే కనీసం రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే వాకింగ్‌ను కూడా పలు విధాలుగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందని వారు అంటున్నారు. వాకింగ్‌ను మనం చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
వాకింగ్‌ను మరీ వేగంగా, మరీ నెమ్మదిగా కాకుండా.. మధ్యస్థంగా చేయాలి. కొద్దిసేపు నెమ్మదిగా నడుస్తూ కాసేపు వేగంగా నడుస్తూ.. ఇలా మార్చి మార్చి వాకింగ్ చేయాలి. దీంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే వాకింగ్ ఎక్కువ సేపు చేయాల్సి వస్తే మధ్య మధ్యలో 1 లేదా 2 నిమిషాలపాటు బ్రేక్ తీసుకోవాలి. దీంతో మళ్లీ వాకింగ్ చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు వాకింగ్ చేయవచ్చు. అలాగే ఎంత సేపు వాకింగ్ చేసినా అలసిపోకుండా ఉంటారు.
వాకింగ్ చేసేటప్పుడు నిటారుగా ఉండాలి. వంగి వాకింగ్ చేయకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు. అలాగే వాకింగ్‌ను ఎత్తైన ప్రదేశంలో చేయాలి. దీంతో ఎత్తు ఎక్కి దిగేటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. అలాగే వాకింగ్ చేసేటప్పుడు చెప్పులు కాకుండా సరైన షూస్ ధరించాలి. దీంతో కాళ్లపై ఒత్తిడి పడదు. ఎక్కువ సేపు వాకింగ్ చేయవచ్చు. ఇలా వాకింగ్ చేసేటప్పుడు పలు టిప్స్‌ను పాటించడం వల్ల వాకింగ్‌తో మరింత ఫలితం పొందవచ్చు.