హెల్త్ టిప్స్

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త చిన్న త‌ప్పు చేసినా అది బిడ్డ ఎదుగుద‌ల‌కు ఆటంకం క‌లిగిస్తుంది. లేదా పుట్ట‌బోయే బిడ్డ‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. క‌నుక గ‌ర్భిణీలు ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. అయితే డెలివ‌రీ అయ్యాక కూడా త‌ల్లులు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే పిల్ల‌ల‌కు పాలిస్తారు కాబ‌ట్టి వారు త‌మ ఆహారాన్ని కూడా ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బాలింత‌ల్లో కొంద‌రికి పాల ఉత్ప‌త్తి స‌రిగ్గా ఉండ‌దు. అలాంటి వారు కింద చెప్పిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్ మీల్‌..

బాలింత‌లు ఓట్ మీల్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆహారంలో తీసుకోవాలి. దీంతో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. అలాగే పాల‌ను వృద్ధి చేయ‌డంలో మెంతులు కూడా ప‌నిచేస్తాయి. మెంతుల నీళ్ల‌ను తాగ‌వ‌చ్చు. లేదా కాస్త మెంతుల పొడిని మ‌జ్జిగ‌లో క‌లిపి తాగాలి. అలాగే మెంతుల‌తో చేసిన ఆరోగ్య‌క‌ర‌మైన కుకీస్‌ను కూడా తిన‌వ‌చ్చు. కాక‌పోతే వీటిలో చ‌క్కెర త‌క్కువ‌గా ఉండేలా చూడాలి. ఇక రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. సైంటిస్టులు దీన్ని రిక‌మెండ్ కూడా చేస్తున్నారు.

how to increase breast milk naturally in telugu

బార్లీ..

బాలింత‌లు బార్లీ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల కూడా పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీంతోపాటు శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. దీంతో బిడ్డ‌కు చ‌క్క‌ని స్వ‌చ్ఛ‌మైన పాలు ల‌భిస్తాయి. నువ్వుల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కూడా బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. నువ్వుల‌తో చేసిన పిండి వంట‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. వీటిని ఎక్కువ‌గా తింటే వేడి చేస్తుంది క‌నుక త‌క్కువ మోతాదులో తినాలి.

ఇలా ప‌లు ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బాలింత‌ల్లో పాలు బాగా ప‌డ‌తాయి. అలాగే అల్లం, బొప్పాయి, శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంలో చేర్చుకోవ‌చ్చు. వీటితోనూ ఫ‌లితం ఉంటుంది. అయితే బాలింత‌లు త‌మ ఆహారం మార్చే ముందు డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం. కొంద‌రికి ఈ ఆహారాలు ప‌డ‌క‌పోవ‌చ్చు. క‌నుక వైద్యుల స‌ల‌హా మేర‌కు డైట్ ను మార్చాల్సి ఉంటుంది.

Admin

Recent Posts