ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము. పిల్లలు ఈ విధంగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు. అలవాటు గానో కావచ్చు. ఎవరినైనా అనుకరిస్తూనో చేయవచ్చు, ఖాళీగా ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూవచ్చు.
చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్నప్పుడు ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి. పరీక్షల భయము, స్నేహితుల ఒత్తిడి, కుటుంబ సభ్యులలో లేదా స్కూల్లో తోటి పిల్లలతో తగాదాలు వంటివి కారణమైతే ఆ దిశగా పిల్లల యాంగ్జైటీని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి.
ఓ అలవాటుగా చేస్తుంటే ఇదెంతటి దురలవాటో, దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, పిల్లల పట్ల ఎదుటివారి అభిప్రాయము ఏవిధముగా ప్రభావితము అవుతుందో వారికి వివరించాలి. బలవంతము గానో, పనిష్మెంట్ల భయంతోనో కాక అవగాహనతో మానిపించే దిశగా ప్రయత్నించాలి. పనిష్మిమెంట్లు ఇవ్వడము వల్ల పిల్లలు గోళ్లు కొరకడాన్ని మానకపోగా ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే వేళ్ళకు చేదు రాయడము వంటివి చేయకూడదు. ఇతరత్రా పనులలో వారిని ఎంగేజ్ చెయ్యడము వల్ల వారికి గోళ్ళు కొరుక్కోవాలన్న తలంపు రాదు.