ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. చర్మం, వెంట్రుకల సంరక్షణకు ఉసిరికాయ ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే లివర్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది.
ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లివర్ సమస్యలను తగ్గిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు నిత్యం ఉసిరికాయలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయల్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* నిత్యం పలు రకాల పచ్చళ్లను తినేవారు వాటికి బదులుగా తాజా ఉసిరికాయ పచ్చడిని తింటే ఎంతో మంచిది.
* ఉసిరికాయలను నిత్యం 2 చొప్పున కొద్దిగా నల్ల ఉప్పుతో కలిపి తినవచ్చు.
* రాత్రి పూట ఉసిరికాయ ముక్కలను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని అలాగే మరిగించి టీ లా తయారు చేసుకుని తాగాలి.
* నిత్యం ఉదయాన్నే పరగడుపునే 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగవచ్చు.
ఇలా పైన తెలిపిన విధంగా ఉసిరికాయలను నిత్యం తీసుకోవడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ సమస్యలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365