Castor Oil For Hair : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఆముదాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటలకే కాదు జుట్టుకు కూడా వాడుతారు. ఆముదాన్ని జుట్టుకు వాడడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆముదం రాయడం వల్ల శిరోజాలకు తేమ లభిస్తుంది. దీంతో చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జుట్టు మృదువుగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఆముదంలో రిసినోలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది. అందువల్ల ఆముదాన్ని వేడి చేసి రాస్తే కీళ్లు, మోకాళ్ల నొప్పులు సైతం తగ్గుతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల మన శరీరంలో కణాలు రక్షించబడతాయి. ఆముదాన్ని తీసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడి సైతం తగ్గుతుంది. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. ఆముదంలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటు తలలో ఉండే దురద తగ్గుతుంది. ఆముదంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సైతం ఉంటాయి. అందువల్ల ఆముదాన్ని రాస్తుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఆముదాన్ని కనుబొమ్మలు, కనురెప్పలపై ఉండే వెంట్రుకలపై కూడా రాయవచ్చు. దీంతో ఆ వెంట్రుకలు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
ఆముదాన్ని ఇలా వాడాలి..
ఆముదాన్ని చాలా మంది నేరుగా అలాగే తలకు అప్లై చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఆముదాన్ని ఇతర నూనెలతో కలిపి వాడాల్సి ఉంటుంది. కొబ్బరినూనె, బాదంనూనె వంటి వాటిల్లో ఆముదాన్ని కలిపి వాడాలి. అలాగే ఆముదాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ సార్లు వాడకూడదు. దీంతో ఆముదం వల్ల శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఆముదాన్ని ఇతర నూనెతో కలిపి జుట్టుకు రాసిన తరువాత కనీసం 1 గంట సేపు వేచి ఉండాలి. తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఇలా ఒకసారి చేస్తే చాలు, మీకు ఉండే జుట్టు సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అయితే ఆముదాన్ని కొనే విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. రీఫైన్ చేయబడినది కాకుండా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ ఆముదం అయితే మేలు. అలాగే ఆముదాన్ని ఉపయోగించిన తరువాత సీసా మూత గట్టిగా పెట్టేయాలి. ఆముదాన్ని కొనుగోలు చేసిన తరువాత 6 నెలల్లోగా పూర్తి చేయాలి. ఎక్కువ కాలం పాటు ఉంచితే అందులో టాక్సిన్లు పేరుకుపోతాయి. అలాంటి ఆముదం మంచిది కాదు. ఇలా ఆముదాన్ని వాడడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.