Idli And Dosa : రోజూ ఉదయాన్నే చాలా మంది అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటారు. కొందరికి టైం ఉండకపోవడం వల్ల బయట పండ్లపై లేదా హోటల్స్‌లో టిఫిన్ తింటుంటారు. ఇంకొందరు ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి తింటారు. చాలా మంది ఇడ్లీ, దోశ వంటివి తింటుంటారు. అయితే డైటిషియన్లు చెబుతున్న ప్రకారం అన్ని టిఫిన్లలోకెల్లా ఇడ్లీ, దోశ మంచివని వారు అంటున్నారు. షుగర్, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు ఇడ్లీ, దోశలను తింటే మేలు జరుగతుందని అంటున్నారు. అయితే వాటిని బియ్యం పిండితో తయారు చేయకూడదు. అవును మరి.. అక్కడే ఉంది అసలు విషయం. ఇంతకీ అసలు డైటిషియన్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ, దోశ మంచివే. కానీ వాటిని బియ్యం పిండితో కాకుండా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలతో తయారు చేయాలట. అప్పుడే అవి మనకు మేలు చేస్తాయని డైటిషియన్లు చెబుతున్నారు. ఇలా చిరుధాన్యాలతో తయారు చేసిన టిఫిన్లను తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చని వారు అంటున్నారు. అయితే ఈ టిఫిన్లలోకి చట్నీలను తయారు చేసి తినడం కూడా ముఖ్యమే.
చిరు ధాన్యాలతో తయారు చేసే టిఫిన్లకు చట్నీని పచ్చి కొబ్బరితో చేసి తినాలని వారు చెబుతున్నారు. టిఫిన్ విషయానికి వస్తే చాలా మంది పల్లీలతో చేసిన చట్నీలను తింటారు. అలా కాకుండా పచ్చి కొబ్బరితో చేసిన చట్నీ తింటే మంచిదని వారు అంటున్నారు. ఇది అయితే పోషకాలు లభిస్తాయి, కొవ్వు తక్కువగా ఉంటుందని, ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుందని అంటున్నారు. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. కనుక ఈ విధంగా రోజూ టిఫిన్లను తయారు చేసి తింటే ఎంతో మేలు జరుగుతుందని, ఓ వైపు టిఫిన్లను రుచి చూస్తూనే మరోవైపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.