హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

గుండె ఒక కండరం అది శరీరమంతా రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. అన్ని కండరాలవలెనే దీనికి కూడా వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండాలంటే, వ్యాయామం మంచిది. శరీరం జబ్బులకు, వ్యాధులకు గురికాకుండా వుంటుంది. వ్యాయామం ఏం చేస్తుంది? వ్యాయామం అధిక కేలరీలను ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేటందుకు తోడ్పడుతుంది. రక్తంలో వుండే కొల్లెస్టరాల్, కొవ్వు వంటివి తగ్గించటానికి సహకరిస్తుంది. వ్యాయామం రక్తప్రసరణ పెంచి గుండె సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. మరి గుండెకు అవసరమైన వ్యాయామాలు ఏవి?

ప్రతిరోజూ వేగంగా నడవండి. కారు లేదా బస్ ఉపయోగించేముందు కొద్దిగా ఆలోచించండి. లిఫ్టులు లేదా ఎస్కలేటర్లవంటివి వాడే బదులు మెట్లు ఎక్కండి. మీతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఆచరించేలా చేయండి. పిల్లలకు సైతం నడక చాలా మంచిది. మనం ఏ వ్యాయామం చేసినా ఆనందించేదిగా వుండాలి. పెద్దవారయ్యే కొద్దీ, సైకిలింగ్, లేదా స్విమ్మింగ్ వంటివి తేలికగా వుంటాయి. మీ ఫిట్ నెస్ స్ధాయికి తగ్గట్లు స్ధానికంగా వుండే వ్యాయామ కేంద్రాలలో చేరండి. నిపుణుల పర్యవేక్షణలో చేసే వ్యాయామాలు మంచి ఫలితాలనిస్తాయి.

if you are doing exercise follow these safety tips for heart health

గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, లేదా చాలాకాలంనుండి వ్యాయామం చేయనివారు వ్యాయామం మొదలుపెట్టేముందు వైద్యుల సలహా పొందండి. వాతావరణం అతి చల్లగా లేదా వేడిగా వున్నా లేదా భోజనం చేసిన రెండు గంటలలోపు వ్యాయామం చేయకండి. వ్యాయామానికి ముందు వామ్ అప్ తప్పనిసరి. అదే విధంగా వ్యాయామం తర్వాత శరీరాన్ని రిలాక్స్ చేసే సమయాన్ని కూడా పాటించాలి.

Admin

Recent Posts