మద్యం సేవించడం అనేది నేటి తరుణంలో కామన్ అయిపోయింది. చిన్న వయస్సులో ఉన్నవారు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. ఇదంతా ప్రభుత్వాల పుణ్యమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ విషయం పక్కన పెడితే కొందరు మద్యం సేవించి శృంగారం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మద్యం సేవిస్తే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చని వారి భావన. కనుక శృంగారానికి ముందు మద్యం సేవించడం కొందరికి అలవాటుగా మారింది. అయితే ఇలా చేయడం అంత మంచిది కాదని, ముఖ్యంగా పలు సమస్యలను పురుషులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆల్కహాల్ సేవించి శృంగారంలో పాల్గొనడం వల్ల రిలీజ్ అయ్యే వీర్యంలో నాణ్యత ఉండదు. వీర్యం నాణ్యత తగ్గిపోతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను దెబ్బ తీస్తుంది. సంతానం కలగకపోవచ్చు కూడా. అలాగే మద్యం సేవించడం వల్ల వీర్యంలో శుక్రకణాల కదలిక సరిగ్గా ఉండదు. ఆ కణాలు ఆరోగ్యంగా కూడా ఉండవు. అలాంటప్పుడు శృంగారం చేసినా వృథాయే అని చెప్పవచ్చు.
మద్యం సేవించి శృంగారం చేయడం వల్ల కాసేపు ఎక్కువ సమయం పాటు శృంగారం చేస్తారు. ఇది కరెక్టే అయినప్పటికీ దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంలో ఇలా చేయడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. శృంగారంపై ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. ఇది నాడీ వ్యవస్థను నెమ్మదింపజేస్తుంది. దీంతో హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. పురుషుల్లో ఇది టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. కనుకు స్త్రీ, పురుషులు ఎవరైనా సరే మద్యం సేవించి శృంగారంలో పాల్గొనే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.