Tea : చాలామందికి టీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు టీ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా టీ ని ఇష్టపడుతూ ఉంటారా..? ఎక్కువగా టీ తాగుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేవగానే చాలామంది వాళ్ళ రోజుని టీతో మొదలు పెడుతూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఒత్తిడి వున్నా, ఎక్కువగా టీ తాగేస్తుంటారు. నిద్ర పట్టకపోయినా టీ తాగేస్తుంటారు. ఎవరైనా వచ్చినా టీ తాగేస్తుంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగేస్తుంటారు.
కానీ, నిజానికి టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయి. టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీ శరీరంలో పోషకాలని నాశనం చేస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కాఫీ, టీ కి పూర్తిగా దూరంగా ఉండాలి. టీ లో కెఫిన్ తక్కువగా, కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. టీ లో ఉండే కెఫిన్ శరీరానికి కొంచెం మేలు చేస్తుంది. కానీ, అధికంగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.
అలసట, గుండె వేగం పెరిగిపోవడం, నిద్రలేమి సమస్యలు కలగవచ్చు. ఎక్కువ కాఫీ, టీ తాగడం వలన పరధ్యానం లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మానసికంగా కూడా వివిధ సమస్యలు రావచ్చు. ఎక్కువగా టీ తాగడం వలన ఎముకల సమస్యలు కూడా కలుగవచ్చు. ఎముకలు నొప్పులు, ఎముకలు అరిగిపోవడం వంటివి కలుగవచ్చు. ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగే వాళ్ళలో, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం ఉందని పరిశోధన చెప్తోంది.
ఐస్ టీ ఎక్కువగా తాగితే, కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు చేరుకోవడం వంటివి కూడా కలగొచ్చు. ఖాళీ కడుపుతో టీ తాగితే, మలబద్ధకం సమస్య వస్తుంది. పొత్తికడుపు నొప్పి వంటివి కూడా కలగొచ్చు. గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా టీ తాగడం మంచిది కాదు. ఎక్కువ టీ తాగితే, డిహైడ్రేషన్ వంటివి కూడా కలుగుతాయి. కాబట్టి, మరీ ఎక్కువగా టీ ని తీసుకోవద్దు. లిమిట్ గానే తీసుకోవాలి. రెండు గ్లాసులు కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.