Gas Trouble : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ సమస్యతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే ఈ సమస్య వచ్చేది. కానీ ప్రస్తుతం చిన్నారులకు కూడా ఈ సమస్య వస్తోంది. అందుకు కారణం మారిన మన ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం అని చెప్పవచ్చు. అయితే మనం తీసుకునే అనేక ఆహారాల్లో గ్యాస్‌ను కలగజేసేవి ఉంటున్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే.. వాటిని తినకుండా ఉండవచ్చు. దీంతో గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఇక గ్యాస్‌ను కలగజేసే ఆ ఆహారాలు ఏమిటి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణాశయంలో గ్యాస్ మొదలవుతుంది. అదే బయటకు వెళ్లలేక మనకు కడుపు ఉబ్బరాన్ని తెచ్చి పెడుతుంది. ఈ ఫుడ్‌ను తింటే గనక గ్యాస్ వస్తుంటే ఎవరైనా ఈ ఫుడ్‌ను తినడం మానేయాల్సిందే. బీన్స్ చాలా మందిలో గ్యాస్‌ను కలగజేస్తాయి. కనుక వీటిని తినగానే గ్యాస్ వస్తే వీటిని తినడం మానేయాలి. దీంతో గ్యాస్ నుంచి బయట పడవచ్చు. అలాగే గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని కలగజేస్తుంది. కొన్ని సార్లు డయేరియా కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆహారం తిన్నాక ఈ లక్షణాలు కనిపించే వారు గోధుమలతో తయారు చేసిన ఏ వంటకాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. కొందరికి గోధుమ పిండితో చేసే చపాతీలను తింటే గ్యాస్ వస్తుంది. కనుక వాటికి దూరంగా ఉండడమే మంచిది.
ఇక కొంతమందికి క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర కూరగాయలను తిన్నా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. కనుక ఈ ఫుడ్ తినేవారు గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ ఫుడ్‌ను తినడం మానేయాల్సి ఉంటుంది. అలాగే పాలు, పాల సంబంధ పదార్థాలను కొందరు బాగా తీసుకుంటారు. అయితే అవి పడకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ పదార్థాల వల్లే గ్యాస్ సమస్యలు వస్తున్నాయనుకుంటే వీటిని తినడం కూడా మానేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, ప్యాక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, శీతల పానీయాలను తాగినా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కనుక ఈ ఫుడ్స్‌ను వీలైనంత తక్కువగా తీసుకుంటే బెటర్. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా ఆహారాల విషయంలో పలు జాగ్రత్తలను తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.