హెల్త్ టిప్స్

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా..? ఇవి తెలిస్తే ఇక‌పై ఆ ప‌నిచేయ‌రు..!

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది. పిల్లలు కూడా వివిధ వెబ్ సైట్స్, యాప్స్ కి బానిస‌లు అయిపోతున్నారు, ఎప్పుడు చూసినా ఫోన్లో ఆటలాడడం లేదా ఏదో ఒక సైట్ లో నిమగ్నమై పోవడం జరుగుతోంది. దీని కారణం గానే వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆటలాడుకోవడం పూర్తిగా తగ్గించేశారు. నిజంగా ఇది శారీరిక వ్యాయామం జరగనివ్వట్లేదు. అంతే కాదు వాళ్ళు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. అయితే చెప్పుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ నష్టాలు చాలానే ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూస్తే ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల పిల్లల మానసిక సామర్థ్యం తగ్గుతుందట. కేవలం ఇది ఒక్కటే కాదు వారికి కంటి సమస్యలు కూడా వస్తాయి. వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని స్మార్ట్ ఫోన్స్ కి దూరంగా ఉంచడం మంచిది.

if you are giving phones to your kids know this

స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే నీలి రంగు లైట్ పిల్లల కంటి చూపుపై ప్రభావం చూపుతుంది. దాంతో చిన్నప్పుడే వారికి ఐ సైట్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఇది పిల్లల్లో వినికిడి లోపం కూడా కలిగే అవకాశానికి దారి తీస్తుంది. అలాగే ఒక పని పై ఫోకస్ చేసి దాన్ని పూర్తి చేయడంలో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్మార్ట్ ఫోన్ వల్ల నిద్రలేమి సమస్య కూడా రావచ్చు. పిల్లలకు తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా కలిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మెమరీపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

Admin

Recent Posts