జీవితంలో ప్రతి ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఆకలి దంచేస్తూ మెళకువ వచ్చేస్తుంది. తరచుగా రాత్రుళ్ళు తినటం మంచిది కాదు. అందుకే పోషకాహార నిపుణులు రాత్రి 8 గంటలకు ముందే తినేయండి త్వరగా నిద్రించండి అంటారు. కాని ఏం చేయటం అర్ధరాత్రి ఆకలికి ఆగలేం! ఆకలికి ఆరోగ్య సూత్రాలు, నియమాలూ అర్ధం కావు. పొట్టలో పేగులు అరిచేస్తూంటాయి. కనుక అర్ధరాత్రి అయినప్పటికి అనవసరమైన కేలరీలు జత చేయకుండా ఏదో ఒకటి తినాలి? అందుకు ఆరోగ్యకరంగా ఏమి చేయాలో చూడండి! 1. సలాడ్లు: బోర్ కొట్టే సలాడ్లు పగలే తినం, రాత్రి ఎలా అంటారా? తినాల్సిందే! మీరు ఎంతో ఆకలితో వున్నారు కనుక. కేరట్లు, బీట్ రూట్, కార్న్, కొత్తిమీర, మిరియం, ఫ్రిజ్ లో వున్న కొన్ని ఉల్లి రింగులు అన్ని కలిపి అందులో సాస్ లేదా మంచి పెరుగు వెసుకుని తినేయవచ్చు.
2. పాప్ కార్న్: ఇందులో అధికంగా వుండేది కార్బోహైడ్రేట్లు. కేలరీలు అతి తక్కువ. తేలికగా జీర్ణం అయిపోతుంది. 3. చల్లటి పాలు: చల్లటి బీరు కంటే కూడా చాలా మంచిది. పాలు గ్యాస్ కలిగిస్తాయా? చల్లటి పాలు కలిగించవు. వాస్తవం చెప్పాలంటే చల్లటి పాలు ఎసిడిటీ తగ్గేటందుకు వైద్యులు తాగమంటారు. పాలల్లో ఐస్ పీసులు వేసి షేక్ చేసి కూల్ డ్రింక్ లా తాగేయండి. ఆరోగ్యమే కాక మంచి నిద్ర కూడా వస్తుంది. 4. క్లబ్ శాండ్ విచ్: ఇంటిలో రెడీగా ఉడికించిన చికెన్ లేదా ఎగ్స్ వుంటే కొన్ని కూరలు కోసి క్లబ్ శాండ్ విచ్ చేసి తినేయండి. అయితే దీనికి బ్రౌన్ బ్రెడ్ మాత్రమే కలపండి. బటర్ ఏ మాత్రం వద్దు. లేదంటే కొద్దిపాటి సాస్ వినియోగించండి.
5. ఓట్స్: వేడిగా ఒక కప్పుడు ఓట్స్ తినేయండి. మంచి నిద్ర పడుతుంది. వీటిలో కొద్దిపాటి కూరలు కలిపితే మరింత రుచిగా వుంటుంది. కడుపు నిండుతుంది. లేదా, చల్లని పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి తినవచ్చు. 6. డ్రైఫ్రూట్స్: వండటం లేదా తయారు చేయటం వుండదు. అన్నీ రెడీమేడ్ గా వుంటాయి. నోటిలో వేసుకుని తినేయడమే. జీడిపప్పు, వాల్ నట్స్, పీనట్స్, పప్పులన్నీ అర్ధరాత్రి తినే తిండే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. వీటిలో షుగర్ కంటెంట్ అధికంగా లేకపోయినప్పటికి మంచి ఎనర్జీనిస్తాయి. నిద్రను ఏ మాత్రం డిస్టర్బ్ చేయవు. జంక్ ఫుడ్ తినేసేకంటే, ఈ తిండి పదార్ధాల చిట్కాలు పాటించటం అర్ధరాత్రి సైతం ఆరోగ్యకరమే!