కొంతమందికి ఎపుడూ ఏదో ఒకటి తినాలన్న ధ్యాస వుంటుంది. అనారోగ్యకరమైన ఛాట్లు, ఇతర జంక్ ఫుడ్ తినేస్తూంటారు. సాధారణంగా భోజనం చేసిన రెండు లేదా మూడు గంటలకు ఆకలి వేస్తూ ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతుంది. ఎపుడు పడితే అపుడు తినాలన్న కోరిక మీలో కొవ్వు కూడా ఏర్పరుస్తుంది. కనుక ఈ రకమైన ఆకలిని నియంత్రించాలంటే, ఆరోగ్యకరమైన దిగువ ఆహారాలు పరిశీలించండి. ఆపిల్ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తుంది. ఇవి కడుపులో మంటను ఆపుతాయి. వెయట్ కూడా నిరోధిస్తాయి.
పచ్చటి కూరలు పోషకాహారం. బరువెక్కుతామన్న భయం లేకుండా కేరట్లు, కేబేజి, బ్రక్కోలి వంటివి తినవచ్చు. కడుపు నింపటమే కాక, ఇవి ఆకలి నియంత్రిస్తాయి. రెండు అరటిపండ్లు తింటే చాలు…మీ ఆకలి ఆగి చురుకైపోతారు. కడుపు నిండిపోతుంది. శరీరానికవసరమైన ఎనర్జీ తక్షణమే దొరుకుతుంది. రెండు కంటే అధికం తింటే కొవ్వు చేరే ప్రమాదం కూడా వుంది.
రొయ్యలు.. వీటిలో కేలరీలు తక్కువ, ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గాలంటే, ఆకలి నియంత్రించాలంటే వీటిని తప్పక తినండి. బాదం పప్పులు, పైన్ వంటి ప్రొటీన్ అధికంగా వుండే పప్పులులో ఫైబర్ అధికం. ఆకలిని నియంత్రించే హార్మోన్లకు ఇవి బాగా సహకరిస్తాయి. బరువు తగ్గేందుకు, తినాలన్న కోరికలు నియంత్రించేందుకు ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు బాగా ఉపయోగపడతాయి.