వేసవికాలం స్టార్ట్ అయింది… స్టోర్ రూంలో బూజు పట్టిన కూలర్ లు బైటికి తీసి వాడినా వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది.. ఎండకి తట్టుకోవడం కన్నా ఇఎమ్ ఐ లు కట్టుకుని ఎసి కొనుక్కొవడం బెటర్ అని చాలామంది ఆలోచన.. వేడెక్కువగా ఉందని ఎసిని పెంచేయడం, వేడికి తట్టుకోలేక గంటలు గంటలు ఎసిలోనే గడపడం చేస్తున్నారా..అయితే మీ చేతులారా మీరే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు…
ఇంకా చెప్పాలంటే మీ ప్రాణాలకి మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు…అవునండి నిజం… ఎక్కువసేపు ఎసి లో గడిపిన వాళ్లు ఒక్కసారిగా బైటికి వచ్చి వేడికి తట్టుకోలేకపోతున్నారని,వాళ్లు ఎక్కువగా వడదెబ్బ బారిన పడ్తున్నారని డాక్టర్లు తేల్చారు.దీనిక్కారణం బైటివాతవరణంతో పోలిస్తే 20డిగ్రీల తేడాతో ఎసిలో గడిపేవాళ్లు బయటివాతావరణానికి తట్టుకోలేకపోవడం…
అలాంటివాళ్లల్లో వాంతులు,తలనొప్పి,కళ్లుతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి.ఇవి చూడడానికి చిన్న సమస్యలుగానే ఉన్నా కొన్ని సార్లు పెద్దవాటికి దారితీస్తాయి….ఆఫీసులోనో,క్లాసురూం లోనో AC లో కూర్చుని ఒక్కసారి బైటికి వస్తే ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనే మాట వింటూంటాం…కాబట్టి గంటలు గంటలు ఎసిలో గడిపేయకుండా అప్పుడప్పుడు ఎసి తగ్గించి మాములు వాతావరణం లో కూడా గడపండి.