హెల్త్ టిప్స్

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?

మన శరీరంలో జీవక్రియలను సమన్వయ పరిచే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్ గ్రంధి ఇది మన శరీరానికి అవసరమైన థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది.అయితే ప్రస్తుతం ఆహారపు అలవాట్లు జీవన విధానం వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్ల ఉత్పత్తిలో వ్యత్యాసం ఏర్పడుతోంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను విడుదల చేసినపుడు హైపర్ థైరాయిడిజం అని,తక్కువ హార్మోన్లను ఉత్పత్తి హైపోథైరాయిడిజంకు కారణమవుతోంది .ఈరెండు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోతే బరువు పెరగడం,జుట్టు ఊడటం,గుండె జబ్బులు,వంటి మానసిక అనారోగ్యం సమస్యలకు కారణం అవుతుంది. ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం చేస్తూ ఆహారంలో సరిపడా అయోడిన్, అమినో ఆమ్లాలు లభించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

* థైరాయిడ్ సమస్య ఉన్నవారు కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉన్న టీ,కాఫీలకు దూరంగా ఉండాలి.

if you are suffering from thyroid them keep away from these foods

* హైఫో థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజి,ముల్లంగి, కాలీప్లవర్, బ్రకోలి లాంటివి ఆహారంగా ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యను మరింత పెంచుతాయి.

* ఫైటోఈస్ట్రోజెన్ అధికంగా ఉన్న సోయాబీన్ ను థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారంగా తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని మరింత ప్రభావితం చేస్తుంది కాబట్టి వీటిని ఆహారంగా తీసుకోకూడదు.

* థైరాయిడ్ రోగులకు హానికరం అయినా రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఇందులో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటాయి.

Admin

Recent Posts