కట్టెల పొయ్యి మీద మట్టికుండలో వండే వంట,రోట్లో నూరే పచ్చడి రుచే వేరు…..ఆహా నోరూరుతుంది కదా చెప్తుంటేనే… ఇడ్లీ పిండి కానీ, దోశ రుబ్బు కానీ మిక్సీ లో వేసిన దానికన్నా రుబ్బుకుంటే బాగుంటుంది..ఇలా అన్ని బాగుంటాయ్ అనుకుంటాం కానీ చేయడానికి మాత్రం బద్దకిస్తాం..ఈ కాలం పిల్లలకు చాలామందికి కట్టెల పొయ్యే తెలీదు..రోలు రోకలి అంటే ఏంటి అని అడిగే పిల్లలు ఉన్నారు…ప్రతి పనికి కూడా సింపుల్ గా అయిపోయే మార్గాలు వెతుక్కుంటున్నాం…రైస్ కుక్కర్ కూడా అలాంటి వాటిల్లో ఒకటి..
ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకోవడం అంటే పెద్ద పనే అనుకునేవాళ్లు చాలామంది..అందుకే కర్రీ పాయింట్స్ పెరిగిపోతున్నాయ్…రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేస్తే ,కర్రీ పాయింట్ నుండి కర్రీ తెచ్చేసుకుంటే అయిపోతుంది..వీకెండ్స్ లో అయితే ఫ్యామిలి ఫ్యామిలి మొత్తం ఏ రెస్టారెంట్లోనో వాలిపోతుంటారు..అయితే రైస్ కుక్కర్ భోజనం మంచిది కాదని తెలిసినా చాలామంది దానికే మొగ్గు చూపుతారు..కాకపోతే ఎందుకు మంచిది కాదో తెలుసుకుంటే కొంతలో కొంతమందైనా రైస్ కుక్కర్ వాడకం తగ్గిస్తారేమో..
వీటిల్లో వండటం వలన ఆహారం విషంగా మారుతుందట. అల్యూమినియం పాత్రల్లో భోజనం వండటం, నిలువచేయడం శ్రేయస్కరం కాదట.. మట్టిపాత్రలు వాడిన మన పూర్వీకులు ఇప్పటికీ ఎంత ఆరోగ్యంగా ఉంటుంటే మనం మాత్రం ఇరవైల్లోనే అరవైవాళ్లలా డీలా పడిపోతున్నాం.. ఎప్పుడైనా సరే భోజనాన్ని గాలి వెలుతురూ తగిలే విధంగా వండాలి, అంతేకావీ మూసి ఉన్న వాటిల్లో ఎప్పుడు వండటం చేయకూడదు అట.. కాబట్టి పూర్తిగా కాకపోయినా అప్పుడప్పుడైనా రైస్ కుక్కర్ వాడకం తగ్గించండి.. మారిన పరిస్థితులను బట్టి విషమిస్తున్న ఆరోగ్యాల్ని బట్టి చాలామంది పాత విషయాలవైపే మొగ్గు చూపుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే రాగిసంగటి, జావ, జొన్నరెట్టెలు వంటి వాడకం పెరిగింది..ఇవి కూడా అంతే..!