Wi-Fi (వైర్‌లెస్ ఫెడెలిటీ) కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు, ఫోన్‌లు మొదలైన వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌లచే రూపొందించబడిన వైర్‌లెస్ నెట్‌వర్క్.WI-FI లేని ఇల్లు ,ఆఫీస్ ఉండవంటే అతిశయోక్తి కాదు..అంతేకాకుండా మాల్స్, రెస్టరెంట్స్, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్ ఇలా ప్రతి చోట వైఫై లభిస్తుంది. ఆఖరుకి మనం ప్రయాణించే క్యాబ్స్ కూడా వైఫై సదుపాయాన్నిస్తున్నాయి… Wi-Fi సిగ్నల్ ల వలన ప్యూబిక్ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎవరికి తెలీదు… Wi-Fi పరికరాల నుండి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) రేడియేషన్‌కు గురి కావడం వలన ఆరోగ్యవంతమైన కణాల అభివృద్ధికి ముఖ్యంగా పిండాభివృద్ధికి అంతరాయం కలుగుతుందని చెబుతారు నిపుణులు.
ఆర్ఎఫ్ ఎక్స్‌పోజర్ గురించి 2004లో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో మూత్రపిండాల అభివృద్ధికి జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. Wi-Fi ఆన్‌లో ఉండగా లేదా సెల్ ఫోన్ సమీపంలో ఉంచుకుని పడుకోవడం వలన దీర్ఘకాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి. Wi-Fi నుండి నిరంతరంగా వచ్చే ప్రసరణలు నిద్రకు అంతరాయం కలిగిస్తాయట.30 నిమిషాల ఆర్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ వలన మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యల్ప ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులకు ఏర్పడతాయని తేలింది. ల్యాప్‌ట్యాప్‌ల నుండి వచ్చే వేడి వీర్యకణాలకు హాని చేస్తుందని తెలిసిన విషయమే. Wi-Fi రేడియేషన్ వలన వీర్య చలనశీలత తగ్గి, డిఎన్ఎలో వైవిధ్యాలు సంభవిస్తాయని తేలింది.పరిశోధకులు వీర్య నమూనాలను 4 గంటలపాటు వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ల్యాప్‌టాప్‌కు సమీపంలో ఉంచి… అభివృద్ధి చెందుతున్న వీర్యం యొక్క చలనశీలత గణనీయంగా తగ్గిపోవడాన్ని మరియు డిఎన్ఎ విచ్ఛిన్నం కావడాన్ని గుర్తించారు.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ ఆర్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌ల వలన మానవుల్లో కేన్సర్ (గ్రూప్ 2బి) సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, జంతువులపై నిర్వహించిన పలు అధ్యయనాల్లో కూడా దీర్ఘకాలంపాటు ఆర్ఎఫ్ ఫీల్డ్‌లకు గురి కావడం వలన కేన్సర్ సంభవించే అవకాశాలు పెరిగినట్లు నిరూపించబడలేదు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ ట్రస్ట్ మరియు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యుఎస్ఎనుండి పరిశోధకులు వైర్‌లెస్ పరికరాల నుండి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్ (ఎమ్‌డబ్ల్యూఆర్) వలన పుట్టని శిశువులు మరియు పిల్లలకు నిజమైన హాని కలగవచ్చని పేర్కొన్నారు. వయోజనులు కంటే పిల్లలు ఎక్కువగా ఎమ్‌డబ్ల్యూఆర్ కిరణాలను శోషిస్తారు. దీని వలన గమనించగల రీతిలో వారి మెదడు కణజాలాలు ప్రభావితమవుతాయి, పుర్రె చిన్నగా మరియు పల్చగా ఏర్పడుతుంది.ముఖ్యంగా పిండానికి ఎమ్‌డబ్ల్యూఆర్ కిరణాలు వలన తీవ్ర హాని కలుగుతుంది.