ఈరోజుల్లో గుండె సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ రావడం, ఇలా ఏదో ఒక సమస్య చాలా మందిలో ఉంటోంది. చాలా మంది, హార్ట్ ఎటాక్ వలన ఇబ్బంది పడుతున్నారు. జిమ్ చేసి చాలామంది హృదయ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా, గుండెపోటుతో వ్యాయామం చేస్తూ చనిపోయారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అయినా కూడా లాభం లేకపోయింది. ఈయనే కాదు చాలామంది సెలబ్రిటీలు అంతకు ముందు వ్యాయామం చేస్తూ, గుండెపోటుతో చనిపోవడం మనం విన్నాము. వ్యాయామం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజు వ్యాయామం చేస్తే, ఎన్నో లాభాలను పొందవచ్చు. ఫిట్ గా కూడా ఉండవచ్చు. అయితే, తీవ్రమైన వ్యాయామం చేయడం వలన గుండెకి ప్రమాదం. కఠోరమైన వ్యాయామాలు చేస్తే, గుండె సమస్యలకి అది దారితీస్తుంది.
కార్డియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేయడం, బరువులు ఎత్తడం వంటివి గుండెపోటుకి దారి తీస్తాయని తెలుస్తోంది. వ్యాయామం చేయడం వలన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, సాధారణ వ్యాయామాలు చేసే వాళ్ళతో పోల్చుకుంటే, జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే వాళ్ళు, శారీరక సామర్థ్యాల పరిమితులను పెంచుకోవడానికి ఎక్కువ వ్యాయామం చేస్తారు.
బాగా ఎక్కువ సేపు పరిగెత్తడం, ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేస్తూ ఉంటారు. దీంతో శారీరిక అలసట మొదలు అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడం వలన ఆకస్మిక గుండెపోటు, స్ట్రోక్ వంటివి కలిగి మరణానికి దారి తీస్తుంది. ఇలా వ్యాయామాల ద్వారా చాలామంది గుండెపోటుని కొని తెచ్చుకుంటున్నారు. వ్యాయామం చేయని వాళ్ళ కంటే, ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ, వ్యాయామం చేసినప్పుడు బాగా ఒత్తిడి పెట్టడం వలన పలు ఇబ్బందులు కలుగుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, వారానికి కనీసం 150 నిమిషాలైనా మితమైన శారీరిక శ్రమ మంచిదని తెలిపారు. క్రీడాకారులు, పోటీల కోసం జిమ్ చేసే వాళ్ళు కార్డియాలజిస్టుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి.