Green Peas : పచ్చి బఠానీలు అంటే చాలా మందికి తెలుసు. వీటిని కూరల్లో వేస్తుంటారు. రకరకాల వంటకాలను వీటితో చేస్తుంటారు. అలాగే బిర్యానీలు, పులావ్‌లలోనూ వీటిని వేస్తుంటారు. అయితే పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో చాలా మందికి తెలియదు. వీటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చికెన్, మటన్, చేపలు.. వంటి మాంసాహారాలను తినలేని వారు పచ్చి బఠానీలను తినవచ్చు. ఎందుకంటే ఆయా మాంసాహారాల్లో ఉండే ప్రోటీన్లకు సమానమైనవి పచ్చి బఠానీల్లోనూ ఉంటాయి. కనుక మాంసాహారాలను తినలేకపోతున్నామని అనుకునేవారు.. పచ్చి బఠానీలను తినవచ్చు. దీంతో కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. కండరాల కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి పచ్చి బఠానీలు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. దీంతో కండరాలు బలహీనంగా మారకుండా ఉంటాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
2. పచ్చి బఠానీల్లో అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని సరఫరా చేస్తాయి. అవయవాలకు పోషకాలను అందిస్తాయి. దీంతో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. పచ్చి బఠానీలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్దకం ఉండదు. ఆకలి పెరుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది.
4. పచ్చి బఠానీలను తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్, హైబీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు.
పచ్చి బఠానీలను రోజూ కూరల్లో వేసుకుని తినవచ్చు. లేదా ఉడకబెట్టి ఉప్పు, కారం చల్లి కూడా తినవచ్చు. వీటితో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.