హెల్త్ టిప్స్

ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ‘తల నొప్పికి ‘ చెక్ పెట్టవచ్చు..!

పెరుగుతున్న జనాభా వల్ల అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం తో రోజు రోజుకి పెరుగుతున్న పని ఒత్తిడి, అలసట, నిద్రలేమి, వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ జలుబు, దంత సమస్యలు, సైనస్ సమస్యలు తలనొప్పికి కారణం అవుతాయి. మరొక కారణం చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పిని సమర్థవంతంగా తిప్పికొట్టే ఆహారాలు ఇవే. సజ్జలు, నువ్వులు, అల్లం,బాదం, అరటి పండు. సజ్జలు : వీటిలో మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పిని తగ్గించడానికి సహాయ పడుతుంది.మెగ్నీషియం మైగ్రేయిన్ తలనొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

నువ్వులు: నువ్వులు లో ఉన్న పోషకాలు కారణం గా తలనొప్పిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తనాళాలను సంకోచ ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మైగ్రేయిన్ తల నొప్పిని తగ్గిస్తాయి. అల్లం: దీనిలో ఉన్న ఆరోగ్య కారణాల వల్ల పూర్వ కాలం నుండి అనేక వ్యాధులకు ఔషధం గా వాడుతున్నారు. అల్లంలో నొప్పికి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి. బాదం: బాదం లో ఉండే పోషకాల వల్ల రక్తనాళాలు మరియు కండరాలకు విశ్రాంతి ఇవ్వటం ద్వారా ఒత్తిడి తగ్గించి తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.

if you have headache take these foods

అరటి పండు: ఇందులో మెగ్నీషియం, పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల హ్యాంగోవర్ కారణం గా వచ్చిన తల నొప్పిని తగ్గించడంలో ప్రభావ‌వంతంగా పనిచేస్తుంది.

Admin

Recent Posts