Blood Sugar Levels : డయాబెటిస్ ఉన్నవారికి ఎంతైనా షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచడం అనేది కష్టంగా మారుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా కొన్ని సార్లు భోజనం అనంతరం కాసేపటికి షుగర్ లెవల్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. దీంతో వారు ఆందోళన చెందుతారు. అయితే కింద తెలిపిన కొన్ని టిప్స్‌ను పాటించడం వల్ల షుగర్ లెవల్స్‌ను నియంత్రణలోకి తేవచ్చు. ఈ టిప్స్‌ను పాటిస్తే ముఖ్యంగా భోజనం చేసిన అనంతరం షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇక ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటారు. వీటిని తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఒక పట్టాన తగ్గవు. కనుక జీఐ విలువ తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. దీంతో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా చూసుకోవచ్చు. జీఐ విలువ కనీసం 55 అంతకన్నా తక్కువ ఉండే ఆహారాలను తినడం మంచిది. దీంతో అలాంటి ఆహారాలను తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి జీఐ విలువ తక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
భోజనం చేశాక వాకింగ్ చేస్తే మంచిది..
చాలా మంది కార్బొహైడ్రేట్లను అధికంగా తింటారు. దీని వల్ల కూడా భోజనం చేసిన వెంటనే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. కనుక కార్బొహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే భోజనం చేసిన వెంటనే కొందరు కూర్చుని పనిచేయడం లేదా కొందరు నిద్రించడం చేస్తారు. ఇలా చేస్తే షుగర్ లెవల్స్ వెంటనే పెరిగిపోతాయి. కనుక భోజనం చేశాక కాస్త గ్యాప్ ఇచ్చి 10 నుంచి 15 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. దీంతో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.
ఇక చాలా మంది నీళ్లను సరిగ్గా తాగరు. దీని వల్ల కూడా రక్తంలో షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కనుక నీళ్లను రోజూ తగినన్ని తాగుతుండాలి. దీంతో షుగర్ పెరగకుండా ఉంటుంది. ఇలా కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల భోజనం చేసిన వెంటనే షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చూసుకోవచ్చు. అయితే భోజనానికి ముందు గ్రీన్ సలాడ్ వంటివి తింటే షుగర్ లెవల్స్ ఇంకా కంట్రోల్‌లో ఉంటాయి. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావు. అలాగే శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. కనుక ఈ టిప్స్‌ను పాటిస్తూ డయాబెటిస్ ను చాలా సులభంగా అదుపు చేయవచ్చు.