హెల్త్ టిప్స్

Kidney Problems : కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త‌..!

Kidney Problems : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. రక్తం నుండి వ్యర్థాలని బయటకి పంపే సామర్థ్యం కనుక కిడ్నీలకి తగ్గింది అంటే, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కలుగుతాయి. చాలామంది, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, కొంతమేర ఈ సమస్య నుండి బయట పడొచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు, క్యాబేజీ తీసుకుంటే మంచిది. క్యాబేజీ లో ఉండే పొటాషియం, ఫాస్ఫరస్ కిడ్నీ సమస్యల వాళ్లకి ఉపశమనాన్ని ఇస్తుంది.

ఇందులో సోడియం తక్కువ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, పవర్ఫుల్ ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ కె, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా క్యాబేజీలో ఉంటుంది. కనుక, జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగు కదలనికల్ని సరిగా ఉండేటట్టు చేస్తుంది. కాలీఫ్లవర్ లో ఉండే పోషకాలు కూడా కిడ్నీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. కాలీఫ్లవర్ లో విటమిన్స్ బాగా ఉంటాయి. అలానే ఫోలేట్ కూడా ఉంటుంది. టాక్సిన్స్ ని ఇది బయటికి పంపించేస్తుంది.

if you have kidney problems then these signs will show

కాలీఫ్లవర్ ని మీరు ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. ఇందులో సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, గుడ్డులోని తెలసోన తినడం మంచిది. అవసరమైన ప్రోటీన్ మీకు లభిస్తుంది. డయాలసిస్ చికిత్స చేయించుకున్న వాళ్లు కూడా దీనిని తీసుకోవచ్చు. గుడ్డును బాగా ఉడికించి మీరు తీసుకోవచ్చు.

అలానే, ఆమ్లెట్, సాండ్విచ్ ల కోసం తెల్ల సొనని వాడడం మంచిది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు, సోడియం తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వెల్లుల్లిలో కూడా సోడియం తక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువ ఉంటుంది. రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఉడికించి తీసుకోవచ్చు లేదంటే కూరలో కూడా వేసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినేటట్టు చూసుకోవడం మంచిది.

Admin

Recent Posts