హెల్త్ టిప్స్

మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ప‌సుపు తినండి..!

పసుపు.. ప్రతి భారతీయుడు నిత్యం ఏదోక వంటలో తింటుంటాడు. పసుపు లేకపోతే ఏ వంటకం బాగుండదు. ఎందుకంటే పసుపు వంటకానికి గొప్ప రుచిని అందిస్తుంది. అంతేకాదు ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు కుర్కుమాలంగా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్క ఎండిన భాగమే పసుపు. అయితే ఇన్ని రోజుల నుంచి పసుపు మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్‌గా మాత్రమే తెలుసు. కానీ మనకు తెలియని మరొక విషయం ఉంది. అది ఏంటంటే.. పసుపు వల్ల మతిమరుపు నుంచి దూరం కావచ్చు, జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు.. మరి పసుపు వల్ల జ్ఞాపకశక్తిని ఎలా పెంచుకోవాలో మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పసుపులో అతి ముఖ్యమైన పదార్థాలను కర్కుమినాయిడ్స్ అంటారు. వీటిలో అత్యంత చురుకైనదాన్ని కర్కుమిన్ అంటారు. ఈ కర్కుమిన్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడమే కాకుండా అధిక ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది.

if you have memory issues take turmeric daily

మన మధ్యే ఉన్న ఎంతోమంది అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నరు. అలాంటి వారికి ఈ పసుపు ఎంతో ఉపయోగపడుతుందని పసుపుపై చేసిన తాజా అధ్యయనాల్లో బయటపడింది. కర్కుమిన్ మెదడులోని ర‌క్త‌ అవరోధాలను తగ్గించేందుకు పసుపు సహాయపడుతుంది.

ఇన్ని ఔషధ గుణాలు ఉన్న పసుపును ప్రతి రోజు ఉపయోగించడం వల్ల మన శరీరానికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.

Admin

Recent Posts