హెల్త్ టిప్స్

బరువు తగ్గాలంటే చేయండిలా..!

బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.

కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి పాలు పడతాయి. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది. స్త్రీలను అలసట బారిన పడేయంతో పాటు అనారోగ్య సమస్యలకీ దారితీసె రక్తహినత నుంచి తప్పించుకోవాలంటే ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

if you have over weight problem take these

బీన్స్, పచ్చి బఠాణీ, రాజ్‌మా, పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. బాదం, పిస్తా, వాల్‌నట్, వేరుసెనగపప్పులను కూడా అధికంగా తీసుకోవాలి. ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్ వంటి ఎండుఫలాలని తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది. భోజనము తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లైతే శరీరానికి ఇనుము అందదు.

Admin

Recent Posts