Heart Attack : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు కూడా ఒకటి. గుండె జబ్బులు, గుండె పోటు వంటి సమస్యలతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు. కొలెస్ట్రాల్, మారిన మన ఆహారపు అలవాట్లు మాత్రమే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే అయినప్పటికి ఇతర కారణాల వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మన రోజూ వారి జీవితంలో జరిగే అనేక కారకాలు మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహారంతో పాటు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ఇతర సమస్యలల్లో నిద్రలేమి కూడా ఒకటి.
నిద్రలేమి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే వాటిలో నిద్రలేమి అగ్రస్థానంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక రోజూ కనీసం 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. దీంతో శరీరానికి తగినంత విశ్రాంతి లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలల్లో ఉండే హార్మోన్లలల్లో ఈస్ట్రోజన్ ఒకటి. ఇది ధమనులల్లో రక్తసరఫరా సక్రమంగా జరగడంలో దోహదపడుతుంది. అదే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో ఈస్ట్రోజన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ధమనులు గట్టి పడి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
దంతాలల్లో, చిగుళ్లల్లో ఉండే బ్యాక్టీరియాలు రక్తం ద్వారా ప్రవహించి గుండెకు చేరుతాయి. ఈ బ్యాక్టీరియాలు గుండె కణజాలాన్ని, కండరాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. కనుక మనం మన నోటి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించుకుంటూ ఉండాలి. అలాగే ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటి సమస్యల కారణంగా అధిక రక్తపోటుతో పాటు రక్తం గడ్డకట్టడం, హౄదయ స్పందనలల్లో మార్పులు రావడం జరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నేటి తరుణంలో చాలా మంది రాత్రి వేళళ్లో పని చేస్తున్నారు. నైట్ షిప్ట్ లు, మారిన మన జీవన విధానం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక నైట్ షిప్ట్ లల్లో పని చేసే వారు తరచూ గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
అలాగే ట్రాఫిక్ జామ్ ల వల్ల కూడా గుండెపోటు వచ్చే అకవాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి, వాహనాల ధ్వనులు, గంటల కొద్ది ట్రాపిక్ లో చిక్కుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ట్రాఫిక్ లో చిక్కుకున్న వారు విలీనైంత ప్రశాంతంగా ఉండాలి. నచ్చిన సంగీతాన్ని, పాటలను వినాలి. ఈ విదంగా మనం రోజూ చేసే పనులు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి కనుక వీలైనంత వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, చక్కటి ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.