Tiredness : సాధారణంగా మనం నిద్ర పోయేది ఎందుకు..? మన శరీరాన్ని పునరుత్తేజం చెందించడానికే కదా. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి నిద్ర చక్కని ఆహ్లాదాన్ని ఇస్తుంది. నిద్ర వల్ల మనం మళ్లీ మరుసటి రోజు శక్తిని పుంజుకుని ఉత్సాహంగా పనిచేస్తాం. నిద్ర కారణంగా మన శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు వ్యాధులు త్వరగా తగ్గుతాయి. కనుక మనకు నిద్ర చాలా అవసరం. అయితే కొందరు ఉదయం నిద్ర లేవగానే అలసిపోయినట్లు ఫీలవుతుంటారు. దీనికి పలు కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరికి ఉదయం నిద్ర లేవగానే శరీరం అంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే చురుగ్గా ఉండాలి. అలా కాకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంటే అందుకు పలు కారణాలను ఉంటాయి. అవేమిటంటే.. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే ఉదయం నిద్రలేచిన వెంటనే అలసిపోయినట్లు ఉంటుంది. అయితే ఒక్క రోజు నిద్ర తక్కువైతే ఇలా కాదు. కొన్ని రోజుల పాటు రోజూ సరిగ్గా నిద్రించకపోతేనే ఈ సమస్య వస్తుంది. మీరు ఉదయం నిద్ర లేవగానే మీకు అలసిపోయినట్లు అనిపిస్తుంటే మీరు కొన్ని రోజుల నుంచి నిద్ర సరిగ్గా పోవడం లేదని అర్థం. కనుక తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది. దీంతో ఉదయం నిద్రలేవగానే యాక్టివ్‌గా ఉంటారు. అలసట తగ్గిపోతుంది.
అలాగే ఉదయం నిద్రలేవగానే అలసిపోయినట్లు ఉండేందుకు మరో కారణంగా డీహైడ్రేషన్‌ను చెప్పవచ్చు. ఎందుకంటే నీళ్లను తాగకపోయినా శరీరం ఇలాగే అలసినట్లు అవుతుంది. కనుక నీళ్లను రోజూ తగినన్ని తాగాల్సి ఉంటుంది. అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి కూడా ఉదయం నిద్రలేవగానే అలసిపోయినట్లు అనిపిస్తుంది.
ఇక విటమిన్ల లోపంతో బాధపడుతున్నవారికి కూడా పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో అలసట కూడా ఒకటి. ముఖ్యంగా విటమిన్ల లోపం ఉంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవారికి కూడా ఇలాగే అవుతుంది. కనుక మీకు కూడా ఇదే సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవండి. దీంతో వారు మీ అలసటకు సరైన కారణాన్ని గుర్తించి చికిత్స చేయగలుగుతారు. అప్పుడు ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.