మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మన బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి , ధారణా శక్తి అతని మేథాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటేఈ 4 పనులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం.
మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు పెరిగి మెదడును ఉత్తేజపరుస్తాయి. అంతేకాక రక్త ప్రసరణ అనాసక్త భాగాలలో విరివిగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది,కానీ ఇది కేవలం పఠనం వల్లనే సాధ్యము, ఆటల ద్వారా టీవీ వీక్షణం వల్ల కాదట. డ్రాయింగ్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది, ఇటీవల జరిగిన ఒక సర్వేలో 62 -70 సంవత్సరాల వయో వృద్దులలో పెయింటింగ్ మరియు ఆర్ట్స్ విభాగాలలో విభజిస్తే పెయింటింగ్ వర్గం వారి మెదడు పనితీరు మెరుగ్గా వుందని తేలింది.
మనం తినే ఆహరంలో గల ఫ్రక్టోజ్ మన జ్ఞాపకశక్తిని, సాధనా శక్తిని తగ్గిస్తుంది, దీనికి కారణం చక్కెరలు మెదడులోని నాడీవ్యవస్థను బలహీన పరుస్తాయి,అంతేగాక బయట దొరికే శీతలపానీయాలూ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గల ఆహారపదార్థాల కన్నా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది. మెదడు నిర్మాణంలో 80 % నీరుంటుంది, దీనిలో ఎంత మాత్రం నీటిశాతం తగ్గినా మెదడు పనితీరును తగ్గుతుంది.