Iron Foods : వయసు పైబడే కొద్ది ఆరోగ్య సమస్యలు రావడం చాలా సహజం. అయితే ఇటువంటి ఆరోగ్య సమస్యలపై తగిన శ్రద్ద చూపించి వాటిని నయం చేసుకోవడం చాలా అవసరం. లేదంటే అవి మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. వయసు పైబడడం వల్ల స్త్రీలల్లో వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలల్లో ఐరన్ లోపం కూడా ఒకటి. వయససు పైబడిన అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.చాలా మంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా తయారవుతాయి. దీంతో హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత సమస్య తలెత్తుతుంది. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, శరీరం పాలిపోయినట్టు ఉండడం, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఆటంకం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేసే కొద్ది మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ ఐరన్ లోపాన్ని మనం చాలా వరకు సప్లిమెంట్స్ తో తగ్గించుకోవచ్చు. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఐరన్ లోపంతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలల్లో ఐరన్ తో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల 26 నుండి 29 శాతం ఐరన్ మన శరీరానికి లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాలేయం, మెదడు, గుండె వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఐరన్ లోపం చాలా వరకు తగ్గుతుంది.
అదే విధంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో బెల్లం కూడా ఒకటి. రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల చాలా వరకు ఐరన్ లోపం తగ్గుతుంది. ఇక ఐరన్ లోపంతో బాధపడే వారు నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. రోజూరాత్రి నీటిలో 10 నుండి 15 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఎండుద్రాక్షలను తిని ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. ఇక ఐరన్ లోపంతో బాధపడే వారు ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. రోజూ ఒక ఆకుకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఆహారం లభిస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.