హెల్త్ టిప్స్

Leg Cramps : కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఏం చేయాలి..?

Leg Cramps : పిక్క‌లు ప‌ట్టేయ‌డం.. దీనినే కాఫ్ పెయిన్ అని కూడా అంటారు. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. రాత్రి స‌మ‌యంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిక్క‌లు ప‌ట్టేయ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ ల అస‌మ‌తుల్య‌త‌ల వ‌ల్ల పిక్క‌ల్లో కండ‌రాలు సంకోచించి నొప్పిని క‌లిగిస్తాయి. అలాగే విట‌మిన్ డి , విట‌మిన్ బి 12, విట‌మిన్ ఇ వంటి విట‌మిన్ లోపాల వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే వెన్నుపూస న‌రాల‌పై ఎక్కువ‌గా ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య తలెత్తుతుంది. అదే విధంగా ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోయి ర‌క్త‌స‌ర‌ఫ‌రా త‌గ్గిన‌ప్పుడు అలాగే ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన‌ప్పుడు కూడా పిక్క‌లు ప‌ట్టేస్తూ ఉంటాయి.

గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో కూడా ఈ స‌మ‌స్య ఉంటుంది. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారిలో, ధూమ‌పానం చేసే వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే కొంద‌రిలో వ్యాయామాలు చేసేట‌ప్పుడు కూడా పిక్క‌లు ప‌ట్టేస్తూ ఉంటాయి. కాలి మ‌డ‌మ‌లో వాపు వ‌ల్ల కూడా పిక్క‌లు ప‌ట్టేస్తూ ఉంటాయి. అయితే కొంద‌రిలో అప్పుడప్పుడూ పిక్క‌లు ప‌ట్టేస్తూ ఉంటాయి. కానీ కొంద‌రు త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు వైద్యున్ని సంప్ర‌దించాలి. ఒక‌వేళ పిక్క‌లు ప‌ట్టేయ‌డంతో పాటు తీవ్ర‌మైన నొప్పి, జ్వ‌రం, ఆ భాగంలో నొప్పి రావ‌డం, అదే విధంగా పాదం మ‌రియు కాలి రంగు మారడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మ‌న శ‌రీరంలో ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టుగా భావించాలి. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వైద్యున్ని సంప్ర‌దించాలి. అయితే పిక్క‌లు ప‌ట్టేయ‌డం అనేది స‌ర్వసాధార‌ణ‌మైన స‌మ‌స్యే అని ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోతే దీని గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.

leg cramps home remedies follow these

ముందుగా స‌మ‌స్య తలెత్త‌డానికి గ‌ల కార‌ణాలు తెలుసుకోవాలి. దీని వ‌ల్ల చికిత్స సుల‌భ‌త‌రం అవుతుంది. పిక్క‌లు పట్టేసిన‌ప్పుడు క‌ద‌ల‌కుడా ఒకే చోట కూర్చోకుండా కొద్దిగా న‌డ‌వాలి. అలాగే నీటిని ఎక్కువ‌గా తాగాలి. ఉప్పు కలిపిన నీటిని లేదా ఒ ఆర్ ఎస్ క‌లిపిన నీటిని తాగాలి. అలాగే వేడి నీటి ప్యాక్ ను నొప్పిక‌లిగే చోట ఉంచ‌డం వ‌ల్ల నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే విధంగా శ‌రీరంలో విట‌మిన్ డి, బి12, ఇ లోపాలు లేకుండా చూసుకోవాలి. నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా పిక్క‌లు ప‌ట్టేయ‌డం అనే స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts