Lemon Water : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మారిన జీవన విధానం వంటి వాటిని అధిక బరువు సమస్య తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం, యోగా, ఆసనాలు వేయడం, ఆహార నియమాలు పాటించడం వంటి వాటితో రోజూ ఉదయం నిమ్మకాయ నీటిని కూడా తాగుతూ ఉంటారు. కొందరు ఇదే నిమ్మకాయ నీటిలో తేనె కలిపి కూడా తాగుతూ ఉంటారు. అయితే చాలా మంది నిమ్మకాయ నీటిని తాగినప్పటికి బరువు తగ్గరు. దీనికి కారణం వాళ్లు ఈ నీటిని తప్పుగా తీసుకోవడమే. నిమ్మకాయ నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దీనిని తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా చేస్తుంది. నిమ్మకాయలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మకాయ నీటిలో పంచదారను కలిపి తీసుకోకూడదు. కేవలం తేనె కలిపి తీసుకోవాలి. అది కూడా గోరు వెచ్చని నీటిలో మాత్రమే కలిపి తీసుకోవాలి. నీళ్లు వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు. అలాగే నీటిలో నిమ్మరసం, తేనె కలిపిన తరువాత నీళ్లు చల్లగా అయితే నీటిని మరలా వేడి చేయకూడదు.
ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే పోషకాలన్నీ తొలగిపోతాయి. ఇలా మరలా వేడి చేసి తీసుకున్న నీటిని తాగడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మకాయ నీటిని ఎలా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది నిమ్మకాయ రసాన్ని పిండి తొక్కను పడేస్తూ ఉంటారు. కానీ నిమ్మతొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. నిమ్మరసం కంటే నిమ్మతొక్కను ఉపయోగించడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నిమ్మతొక్కలు ఎంతో సహాయపడతాయి. ముందుగా పెద్దగా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడగాలి. తరువాత పీలర్ తో నిమ్మకాయపై ఉండే పసుపు తొక్కను మాత్రమే తీసుకోవాలి.
లోపల ఉండే తెల్లటి భాగాన్ని తీసుకోకూడదు. ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీటిని ఒక గాజు సీసాలోకి తీసుకుని అందులో నిమ్మతొక్కను ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకోవాలి. ఈ నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనెను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా నిమ్మకాయ నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.