Lemon : నిమ్మకాయ రుచికి పుల్లగా ఉంటుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. నిమ్మకాయను తీసుకోవడం ద్వారా శరీర జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నిమ్మ నీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ ప్రకారం.. నిమ్మ వాడకం శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, ఆస్తమా విషయంలో కూడా ఉపయోగపడుతుంది.
నిమ్మకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, ఫాస్ఫరస్, జింక్, ఫోలేట్, రాగి, పాంటోథెనిక్ ఆమ్లం, నియాసిన్, థయామిన్, అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
1. నిమ్మకాయను తీసుకోవడం ద్వారా శరీర జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మ నీరు తాగడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు కరుగుతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
2. ఆరోగ్యంతోపాటు నిమ్మ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నిమ్మరసం ముఖం మీద మొటిమలను తొలగించడానికి పని చేస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.
3. పొట్ట దగ్గరి కొవ్వు, బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి ఖాళీ కడుపుతో తాగాలి. మీకు కావాలంటే అందులో ఒక చెంచా తేనెను కూడా కలుపుకోవచ్చు. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు.
4. నిమ్మరసం షుగర్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వారి షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. కనుక నిమ్మరసాన్ని రోజూ తీసుకోవాలి.
5. నిమ్మరసంలో కొద్దిగా చక్కెర, అల్లం రసం కలిపి తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కూరగాయలు, పప్పులపై నిమ్మకాయ రసాన్ని పిండడం వల్ల కూరగాయలకు, పప్పుకు చక్కని రుచి వస్తుంది. పోషకాల శాతం పెరుగుతుంది. ఆహారాలను త్వరగా జీర్ణం చేయడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది.