Life Extending Tips : ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ దాని కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయరు. మనం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే జీవనశైలిలో మార్పు చేసుకోవడం చాలా అవసరం. అలాగే కొన్ని నియమాలను అలవాటుగా మార్చుకోవాలి. వీటిని ప్రతిరోజూ తప్పకుండా పాటించాలి. ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలనుకునే వారు ఇప్పుడు చెప్పే నియమాలను అలవాటుగా మార్చుకోవడం వల్ల 10 సంవత్సరాల పాటు ఎక్కువగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం పాటు జీవించాలనుకునే వారు తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ 30 నిమిషాల పాటు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి.
వాకింగ్, ఈత, సైక్లింగ్ వంటి వాటిని చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. చక్కెరలు, అధిక ఉప్పు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే రోజూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటితో పాటు రోజూ ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి. ప్రకృతిలో సమయం ఎక్కువగా గడపాలి. ఒత్తిడి, ఆందోళన వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర ఆరోగ్యంపై దృష్టి సారించాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు.
ఇవి శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపాలి. దీని వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరగా జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజూ కృతజ్ఞతా భావాన్ని పాటించాలి. ఇది మానసిక ఆరోగ్యాన్ని, స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విధంగా రోజూ ఈ నియమాలను పాటించడం వల్ల మనం ఎక్కువ కాలం పాటు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.