Liver Clean : మన శరీరాన్ని వ్యర్థ పదార్థాల నుండి రసాయనాల నుండి విష పదార్థాల నుండి రక్షించి శరీరాన్ని శుభ్రపరిచేది కాలేయం. కాలేయ కణాలకు ఉన్నంత శక్తి శరీరంలో మరే ఇతర కణాలకు లేదని చెప్పవచ్చు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల రసాయనాలు, విష పదార్థాలు ఎక్కువగా లోపలికి వెళ్తున్నాయి. దీంతో కాలేయ కణాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. కాలేయ కణాలు దెబ్బతింటే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కాలేయ కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయం ఏ మాత్రం దెబ్బతిన్నా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం కాలేయ కణాలను సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
విష పదార్థాలు, మనం తీసుకునే ఆహారంలో ఉండే రసాయనాలు కాలేయ కణాలను దెబ్బతిన్నకుండా చేయడంలో మనకు తెల్ల తెగడ కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. తెల్ల తెగడ వేర్లు మనకు బయట ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా లభిస్తాయి. ఈ వేరు పొడిని గోరు వెచ్చని నీళ్లల్లో వేసి కలిపి తాగవచ్చు. అలాగే తెల్ల తెగడ వేర్లను నీళ్లల్లో వేసి మరిగించి వడకట్టుకుని కూడా తాగవచ్చు. ఈ తెల్ల తెగడ వేర్ల కషాయాన్ని తాగడం వల్ల కాలేయం కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఈ కషాయాన్ని తాగినప్పుడు హైడ్రాక్సిప్రోలైన్, ఎల్ డి హెజ్ అనే రెండు ఎంజైమ్ లు కాలేయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ ఎంజైమ్ ల వల్ల కాలేయ కణాలు వాటంతట అవి శుభ్రపడతాయి.
అలాగే కాలేయ కణాలు ప్రతిరోజూ ఉత్సాహంగా పని చేస్తాయి. అదే విధంగా కాలేయ కణాలు దెబ్బతిన్నకుండా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కూడా తెల్ల తెగడ వేర్ల కషాయం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యపానం సేవించడం, జంక్ ఫుడ్ తినడం వల్ల కాలేయ కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. అలాగే ఫ్యాటీ లివర్ కారణంగా కూడా కాలేయ కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. అలాంటివి జరగకుండా కాలేయకణాలను రక్షించడంలో ఈ వేర్ల కషాయం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. కనుక తెల్ల తెగడ వేర్ల కషాయాన్ని తాగడం వల్ల మన కాలేయ దెబ్బతినకుండా ఉంటాయి. తద్వారా మన శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.