Liver Detox : లివ‌ర్‌ను పూర్తిగా శుభ్రం చేసే డ్రింక్‌.. రోజూ ఈ స‌మ‌యంలో తీసుకోవాలి..

Liver Detox : మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. శ‌రీరంలో కీల‌క‌మైన విధులన్నింటిని కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం కీల‌క పాత్ర పోషిస్తుంది. మందుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌పానం వ‌ల్ల శ‌రీరంలో చేరే విషాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపిస్తుంది. కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తిన‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా చాలా మంది వైద్యుల‌ను సంప్ర‌దించ‌కుండా మందుల‌ను వాడుతున్నారు. ఇలా అధికంగా మందులు వాడ‌డం వ‌ల్ల కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.

అలాగే జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్యపానం, ధూమ‌పానం, మాన‌సిక ఒత్తిడి వంటి అనేక కార‌ణాల చేత కాలేయం ఆరోగ్యం దెబ్బ తింటుంది. కాలేయం దెబ్బ తింటే మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌లు మొత్తం గాడి త‌ప్పుతాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌రిస్థితి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కాలేయంలోని మ‌లినాల‌ను తొల‌గించి కాలేయాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఒక డిటాక్స్ డ్రింక్ ను మన ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్నితీసుకున్న 24 గంట‌ల్లోనే కాలేయంలోని మ‌లినాలు తొల‌గిపోవ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

Liver Detox drink take daily at this time for better result
Liver Detox

మ‌న శ‌రీరానికి మేలు చేసే ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం సొర‌కాయ ముక్క‌లను, కొత్తిమీర‌ను, ప‌సుపును,నిమ్మ‌ర‌సాన్ని, బ్లాక్ సాల్ట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో సొర‌కాయ ముక్క‌ల‌ను, గుప్పెడు కొత్తిమీర‌ను, కొద్దిగా నీటిని పోసి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ప‌సుపును వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత అందులో అర చెక్క నిమ్మ‌రసాన్ని, రుచికి త‌గినంత బ్లాక్ సాల్ట్ ను వేసి క‌ల‌పాలి. బ్లాక్ సాల్ట్ అందుబాటులో లేని వారు ఇందులో రాళ్ల ఉప్పును కూడా వేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల కాలేయం డిటాక్స్ డ్రింక్ త‌యార‌వుతుంది. ఈ పానీయాన్ని ఉద‌యం అల్పాహారం చేసిన అర గంట త‌రువాత తీసుకోవాలి.

అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న త‌రువాత గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు, తాగ‌కూడ‌దు. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల కాలేయంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోయి కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం కూడా శుభ్ర‌ప‌డుతుంది. శ‌రీరంలోని మ‌లినాల‌న్నీ తొల‌గిపోతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే తాజా కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల కాలేయం శుభ్ర‌ప‌డడంతో పాటు మ‌న ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

D

Recent Posts