కొన్ని ఆహారాలు శరీరానికే కాదు మనసుకు ఆహ్లాదాన్నిచ్చి మూడ్ మారుస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఇస్తాయి. ఇటువంటివి తింటే, శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి ప్రేమికులు వీటిని తింటే ఎంతో ఆహ్లాదంగా వుండి రెట్టింపు ఆనందం పొందుతారు. ఆ రకమైన కొన్ని ప్రధాన ఆహారాలు పరిశీలిద్దాం. స్ట్రాబెర్రీలు, క్రీము మిశ్రమం రాత్రివేళ బెడ్ పై మంచి మూడ్ ఏర్పరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వుండే స్ట్రాబెర్రీలు కేన్సర్ కు మంచి ఔషధం గా కూడా పని చేస్తాయి.
డార్క్ చాక్లెట్ – ప్రేమికులు డార్క్ చాక్లెట్ సగం సగం తినేస్తారు. తీపిలేని దీనిలోని కోకో గుండెకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కేరట్లు – కుందేళ్ళు కేరట్లను తిని ఎంతో చురుకుగా, ఆరోగ్యంగా వుంటాయని మీకు తెలిసిందే. కరకరలాడే ఎర్రనైన కేరట్లు చాలామంది పురుషులు ఇష్టపడతారు.
పైన్ ఆపిల్ – కామోద్దీపన ఆహారం. పురుషుల నపుంసకత్వానికి మంచి ఔషధం. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా వుండటంతో జలుబు వంటివి దగ్గరకు రావు. బాదం పప్పులు – బరువు తగ్గిస్తాయి. తింటే చాలా ఆహ్లాదంగా వుంటుంది. మంచి కొలెస్టరాల్ ఇస్తాయి. వీటిలో వుండే సహజ నూనెలు పోషక విలువలు కలిగిస్తాయి. వైన్ – పడకపై మహిళ వుందంటే…వైన్ జోడైతే మూడ్ మహా బాగు. వైన్ మీ రక్తాన్ని పలుచబడేసి రక్తపోటు తగ్గిస్తుంది. గుండెకు చాలా మంచిది. అయితే….రోజుకు ఒక్క గ్లాసు మాత్రమే సుమా! ప్రేమను పెంచే ఈ ఆహారాలను మీ ఆహారాల జాబితాలో నేడే చేర్చండి.