Lungs Health : మన శరీరంలోని అనేక అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. ఇవి మనం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజన్‌ను శరీరానికి అందిస్తాయి. దీని వల్ల మన శ్వాస క్రియ సరిగ్గా జరుగుతుంది. మన శరీరంలో చేరే ఆక్సిజన్‌తో మనం తిన్న ఆహారం ఇంధనంగా మారుతుంది. దీంతో మనకు శక్తి లభిస్తుంది. ఈ క్రమంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను మళ్లీ ఊపిరితిత్తులు బయటకు పంపుతాయి. దీంతో చెడు గాలి బయటకు వెళ్లిపోతుంది. ఇలా ఊపిరితిత్తులు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఇవి శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని రకాల జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. అయితే రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు.. ధూమపానం, కాలుష్యం వంటివన్నీ ఊపిరితిత్తుల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దీంతో లంగ్స్‌లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీని వల్ల మనకు అనేక శ్వాస సమస్యలు వస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకు గాను పలు రకాల ఆహారాలు దోహదపడతాయి. అవేమిటంటే..
మనం రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఇక రోజువారీ ఆహారంలో క్యారెట్, చిలగడదుంపలు, ఆకుకూరలు వంటి వాటిని చేర్చుకోవాలి. వీటిల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక వీటిని రోజూ తీసుకోవాలి. ఇవే కాకుండా చేపలను కూడా తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇక క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి వాటిని తినడం వల్ల కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల కణాలను రక్షిస్తాయి. కనుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బచ్చలికూర, బీట్రూట్, నిమ్మజాతి పండ్లు తదితరాల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక వీటిని కూడా తరచూ తీసుకోవాలి. ఇక నారిజం, నిమ్మ, టమాటా, క్యాప్సికమ్, కివీ పండ్లు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్, మామిడి పండ్లలో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని కూడా తరచూ తీసుకోవాలి. దీని వల్ల ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తాయి.
ఇక వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మేలు జరుగుతుంది. అలాగే రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తినాలి. ఇది శ్వాస వ్యవస్థను పూర్తిగా శుభ్రం చేస్తుంది. దీంతోపాటు అల్లం రసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని రెండింటినీ కలిపి సేవించాలి. పరగడుపునే ఇలా తీసుకుంటుంటే మేలు జరుగుతుంది. అలాగే రాత్రి పాలలో కాస్త పసుపు కలిపి తాగినా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు.