డయాబెటిక్ రోగంతో బాధపడే వారికి కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది.
కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు టమాటాలు, చిన్న కీరకాయ ఒకటి. ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే…
కాకర కాయ, టమోటా, కీరకాయ మూడింటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయండి. ఇందులో ఒక గ్లాసు నీరు కలపండి. తెల్లటి గుడ్డలో ఈ మిశ్రమాన్ని వడగట్టండి. తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండి ప్రతి రోజు ఉదయం వేళ పరకడుపున తాగండి. ఇలా ప్రతి రోజు తాగితే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్త ప్రసరణలో కూడా ఈ రసం బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు.. దీంతోపాటు మధుమేహవ్యాధి కూడా అదుపులోవుంటుందంటున్నారు.