హెల్త్ టిప్స్

కలబందను అస్సలు లైట్ తీసుకోవద్దు…!

ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలోనూ కలబంద మొక్కను మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా సులువుగా ఎటువంటి నేల మీద అయినా ఇట్టే పెరుగుతుంది. ఒక్కసారి నేలలో ఈ మొక్కను నాటితే చాలు, నేలలోకి వేర్లు చొచ్చుకుపోయి ఆ ప్రాంతంలో ఎప్పటికీ చిన్న కలబంద మొక్కలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఈ కలబంద రసాన్ని, లేదా కలబంద గుజ్జు వాడకం పెరిగింది.

దీనికి కారణం కలబంద ఎన్నో రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద జ్యూస్‌ను తాగడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. కలబంద మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చర్మ సంరక్షణ ర్యాసిస్‌, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం మొదలగు వాటికీ కలబంద మంచి ఫలితాలని ఇస్తుంది. 15 రకాల పోషకాలు మిళితమై మంచి శక్తి నిస్తాయి.

many wonderful health benefits of aloe vera

ఈ మొక్క సహజ నివారిణి అని కూడా అంటారు. పరగడుపున కలబంద గుజ్జును తింటే, కడుపులో ఉన్న కొన్ని రకాల వ్యాధులను మాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. తల వెంట్రుకలకు, చర్మ సౌందర్యం కోసం కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది.

కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది. తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది. తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను ఇది తగ్గిస్తుంది.

Admin