హెల్త్ టిప్స్

బోటి తినే అలవాటు లేదా.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే..!

సాధారణంగా మనం మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాము అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ మాంసాహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. చాలామంది బోటి తినడానికి ఇష్టపడగా మరికొందరు ఇష్టపడరు. అయితే చాలామందికి ఈ బోటి తినే అలవాటు ఉండదు. ఇలా బోటికనక మీరు తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక లేదా పొట్టేలు బోటిలో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బోటిలో మనకు ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇది కోలిన్ యొక్క మంచి మూలం..ఇది మెదడు పనితీరును నిర్వహించడానికి ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది.మేక ప్రేగులలో ఇనుము, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E మరియు K వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

many wonderful health benefits of boti

ఇలా ఈ పోషకాలు బోటిలో అధికంగా ఉన్నాయి కనుక తరచూ బోటిని తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం పొంది మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఎంతగానో దోహదపడుతుంది. 1/2 కప్పు మేక ప్రేగులలో 1.57 mg విటమిన్ B12 ఉంటుంది. ఇందులో రోజువారీ తీసుకోవడంలో 65 శాతం ఉంటుంది. విటమిన్ B12 అధికంగా పొందటం వల్ల చర్మం, జుట్టు, కళ్ళు కాలేయం ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అందుకే నెలలో కనీసం రెండు లేదా మూడుసార్లు అయినా బోటి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts