హెల్త్ టిప్స్

Bananas : రోజుకో అర‌టి పండును తింటే.. ఇన్ని లాభాలా..!

Bananas : ప్రతి శుభకార్యానికి మనకు మొదట గుర్తుకు వచ్చేది అరటి పండ్లు. అరటి పండు నిత్యం ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. చ‌వ‌క ధరలో లభించి ఎక్కువ పోషకాలు ఉన్న ఫలం ఏది అని చెప్పాలి అంటే ముందు అరటిపండు పేరే గుర్తుకు వస్తుంది. ప్రతి రోజూ ఒక అరటిపండు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలా అని ఎక్కువగా తింటే సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రోజుకి కనీసం ఒక అరటిపండు తిని అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అరటి పండులో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది.

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటమే కాకుండా శరీరంలో కండరాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది అరటిపండు తింటే బరువు పెరుగుతామనే అపోహతో అరటిపండును తినడానికి ఇష్టపడరు. కానీ మితంగా రోజుకొక అరటిపండు తింటే బరువు త‌గ్గుతారు. అరటి పండులో ఉండే లెక్టిన్ అనే రసాయనం ఎటువంటి వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలను కిడ్నీ ఇన్ఫెక్షన్లు, అతిగా మూత్రం కావడం తగ్గిస్తుంది. అరటిపండులో సహజ రసాయనాలు ఉండటం వ‌ల్ల‌ మానసిక ఒత్తిడి తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

many wonderful health benefits of eating daily one banana

అంతేకాకుండా పైల్స్‌ సమస్యతో బాధపడుతున్న వారు మరియు మలబద్దక సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు రోజుకి ఒక అరటి పండును ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగ్గా పని చేసి విరేచనం సాఫీగా అవడానికి సహాయం చేస్తుంది. పైల్స్ వల్ల కలిగే నొప్పి, దురద సమస్యలు తగ్గించడంలో ప్రభావం చూపుతుంది. కఫ దోషం మరియు జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండుకు దూరంగా ఉండటం మంచిది. మిగిలిన వారు ఎవ‌రైనా స‌రే అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts