ప్రస్తుతం మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. అయితే పోషకాల విషయంలో అవిసె గింజలు మేటి అయినప్పటికీ చాలా మందికి వీటి గురించి తెలియదు. ఇక తెలిసిన వారు కూడా వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ నిజానికి అవిసె గింజలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* అవిసె గింజల్లో వృక్ష సంబంధ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏఎల్ఏ ఉంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దీని వల్ల స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* అవిసె గింజల్లో లిగ్నన్స్ అనబడే పోషకాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అలాగే ఒయిస్ట్రోజెన్ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఇతర క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.
* అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. నిత్యం విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
* అవిసె గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
* హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు నిత్యం ఈ గింజలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. బీపీని తగ్గించుకోవచ్చు.
* మాంసం తినని వారికి అవిసె గింజలు చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే మాంసం తినకపోయినప్పటికీ అవిసె గింజలను తింటే వీటి వల్ల వృక్ష సంబంధ ప్రోటీన్లు అందుతాయి. దీంతో శక్తి లభిస్తుంది. కణజాలం నిర్మాణం అవుతుంది.