హెల్త్ టిప్స్

Green Peas : ప‌చ్చి బఠానీల్లో ఉండే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు..!

Green Peas : ప‌చ్చి బ‌ఠానీల‌ను వాస్త‌వానికి చాలా మంది అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే తింటారు. వీటితో తీపి లేదా కారం వంట‌కాల‌ను చేసి తింటారు. చిరుతిళ్లు, స్వీట్లు, మ‌సాలా వంట‌కాల్లో మాత్ర‌మే ప‌చ్చి బ‌ఠానీల‌ను వాడుతారు. కానీ వాస్త‌వానికి వీటిని రోజూ తినాలి. రోజూ కాసిన్ని ప‌చ్చి బ‌ఠానీల‌ను ఉడ‌క‌బెట్టి పోపు వేసి తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు, మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌చ్చి బ‌ఠానీల్లో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని పోష‌కాల‌కు గ‌ని అని చెప్ప‌వ‌చ్చు.

ఒక క‌ప్పు ప‌చ్చి బ‌ఠానీల్లో ప్రోటీన్లు 8 నుంచి 12 గ్రాముల మేర ల‌భిస్తాయి. ప్రోటీన్లు మ‌న శ‌రీర నిర్మాణానికి, కండ‌రాల పెరుగుద‌ల‌కు, శ‌క్తికి ఎంతో అవ‌స‌రం. చికెన్‌, మ‌ట‌న్ వంటి నాన్‌వెజ్ ఆహారాల‌ను తిన‌లేని వారికి ప‌చ్చి బ‌ఠానీలు గొప్ప వ‌రం అని చెప్ప‌వ‌చ్చు. వీటితో శాకాహారుల‌కు ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి వారికి ఎంతో మేలు చేస్తాయి. ప‌చ్చి బ‌ఠానీలు షుగ‌ర్ పేషెంట్స్‌కు కూడా వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు స‌రిక‌దా.. ఇవి షుగ‌ర్‌ను త‌గ్గిస్తాయి. అలాగే అధిక బ‌రువును కూడా ఇవి త‌గ్గించ‌గ‌ల‌వు. శ‌రీరంలోని కొవ్వును క‌రిగిస్తాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతాయి.

many wonderful health benefits of green peas

ప‌చ్చి బ‌ఠానీలు గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రావు. అలాగే వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు క్యాన్స‌ర్ ద‌రి చేర‌కుండా చూస్తాయి. ఇలా ప‌చ్చి బ‌ఠానీలు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. క‌నుక రోజూ వీటిని త‌ప్ప‌నిస‌రిగా తినాల్సి ఉంటుంది.

Admin

Recent Posts