హెల్త్ టిప్స్

ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?

ఫ్రెంచ్ కిస్, ఇంగ్లిష్ కిస్… ఇలా ముద్దుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఈ క్రమంలో కపుల్స్ చుంబన ప్రక్రియలో అప్పుడప్పుడు మునిగి తేలుతారు. ఆ మాటకొస్తే విదేశీయులు ముద్దు పెట్టుకోవడాన్ని కామన్ విషయంగా భావిస్తారు. కానీ మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా తీసుకుంటారు. అయితే జంటలు ఎలా పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోవడమనే క్రియ ద్వారా వారి ఆరోగ్యానికి మంచే జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే చుంబనం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముద్దు పెట్టుకోవడం వల్ల కపుల్స్ ఎక్కువ సంతోషంగా ఉంటారట. ఒకరి భావాలను మరొకరితో పంచుకునేందుకు కూడా ముద్దు ఉపయోగపడుతుందట.

చుంబన ప్రక్రియ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందట. ఒత్తిడి, ఆందోళన, ఆతురత వంటివి క్రమంగా దూరమవుతాయట. జంటలు ముద్దు పెట్టుకోవడం వల్ల వారి వివాహ బంధం మరింత బలపడుతుందట. ఒకరిపై ఒకరికి మరింత ప్రేమ, ఆప్యాయత కలుగుతాయట. ముద్దు పెట్టుకునే ప్రక్రియలో శరీరం అడ్రినలిన్ అనే రసాయనాలను విడుదల చేస్తుందట. దీని వల్ల వివిధ రకాల నొప్పులు తగ్గిపోతాయట. ముద్దు పెట్టుకునే సమయంలో ఎక్కువగా ఉత్పన్నమయ్యే సలైవా (ఉమ్మి) దంతాలను సంరక్షిస్తుందట. దీని వల్ల దంత క్షయం దూరమవడంతోపాటు వాటిలో పేరుకుపోయిన‌ వ్యర్థాలు తొలగింపబడతాయట.

many wonderful health benefits of kissing

కిస్ చేయడం వల్ల సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట. ఇవి రిలాక్స్‌డ్ ఫీలింగ్‌ను ఇవ్వడమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయట. చుంబన ప్రక్రియ వల్ల తలనొప్పి మటుమాయమవుతుందట. ముద్దు పెట్టుకోవడం వల్ల ఆడ, మగ ఇద్దరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. ఇది వారికి ఇతర పనుల్లోనూ సహాయకారిగా ఉంటుందట. ముద్దు పెట్టుకుంటే మెడ, దవడ కండరాలకు వ్యాయామం జరిగి అవి మంచి షేప్‌కు వస్తాయట. ముద్దు పెట్టుకోవడం వల్ల నిమిషానికి 2 నుంచి 3 క్యాలరీలు ఖర్చవుతాయట. దీంతోపాటు శరీర మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందట. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుందట.

రక్తపోటును నియంత్రించడంలోనూ కిస్సింగ్ బాగానే పనిచేస్తుందట. రక్త నాళాలు వ్యాకోచం చెంది రక్త సరఫరా మెరుగుపడుతుందట. ముద్దు పెట్టుకోవడం వల్ల జంటల్లో ఒకరిపై ఒకరికి గౌరవం కూడా పెరుగుతుందట. ఇది వారి బంధాన్ని మరింత దృఢ పరుస్తుందట.

Admin

Recent Posts